IND vs SA: తొలిటెస్టుకు టీమ్‌ఇండియా జట్టు ఇలాగే ఉండొచ్చు..! విశ్లేషకుల అంచనా ఇదే
తొలి టెస్టుకు జట్టు కూర్పును రూపొందించుకోవడం టీమ్‌ఇండియాకు తియ్యటి తలనొప్పిగా మారింది! కుర్రాళ్లంతా మ్యాచుకు సంసిద్ధంగా ఉన్నారు. వారికి అవకాశాలు ఇవ్వాలంటే సీనియర్లను పక్కన పెట్టక తప్పదు.
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీసుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. సెంచూరియన్‌లో కఠోరంగా సాధన చేస్తోంది. ఇప్పటి వరకు సఫారీ గడ్డపై భారత్ ఒక్కసారీ టెస్టు సిరీస్ గెలవలేదు. 29 ఏళ్లుగా ఎదురు చూస్తున్న కలను నెరవేర్చుకోవాలని భారత్ కసితో ఉంది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఈ సిరీసు భాగం కాబట్టి కోహ్లీసేన పట్టుదలగా ఆడనుంది.
తొలి టెస్టుకు జట్టు కూర్పును రూపొందించుకోవడం టీమ్‌ఇండియాకు తియ్యటి తలనొప్పిగా మారింది! కుర్రాళ్లంతా మ్యాచుకు సంసిద్ధంగా ఉన్నారు. వారికి అవకాశాలు ఇవ్వాలంటే సీనియర్లను పక్కన పెట్టక తప్పదు. గాయపడ్డ రోహిత్ శర్మ స్థానంలో ఎంపికైన ప్రియాంక్ పంచాల్‌కు చోటు దొరకడం కష్టమే.
దాదాపుగా ఇద్దరు మిత్రులు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. చెతేశ్వర్ పుజారా సైతం ఈ పాత్రకు సిద్ధంగానే ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ గట్టిపోటీ ఇస్తుండటంతో అజింక్య రహానెకు ఇబ్బందులు తప్పేలా లేవు. హనుమ విహారి బదులు పేస్ బౌలింగ్ చేసే శార్దూల్‌ను ఎంచుకుంటారని తెలుస్తోంది.
📸 M🙂🙂D in the camp right now
— BCCI (@BCCI) December 21, 2021
All smiles here at Centurion 😃#TeamIndia | #SAvIND pic.twitter.com/IOaMfH6h7h
Team India's Possible Playing 11 - అంచనా జట్టు
కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (కీపర్), శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
మూడు టెస్టుల సిరీసులో తొలి టెస్టు డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా ఆరంభమవుతోంది. జనవరి 3 నుంచి జోహానెస్ బర్గ్‌లో రెండో మ్యాచ్, జనవరి 11 నుంచి కేప్‌టౌన్‌లో ఆఖరి మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత వన్డే సిరీస్ మొదలవుతుంది.
Also Read: IND vs SA: టెస్టు సిరీసు ముందు సఫారీలకు షాక్..! ఆ భయంకర పేసర్ సిరీసు నుంచి ఔట్!
Also Read: South Africa vs India: కోచ్ ద్రవిడ్ రికార్డుకే ఎసరు పెట్టిన కెప్టెన్ కోహ్లీ
Also Read: BWF Rankings: రెండేళ్ల తర్వాత టాప్-10లోకి కిదాంబి శ్రీకాంత్.. లక్ష్యకు కెరీర్ బెస్ట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి