అన్వేషించండి
ICC Award to Mohammad Siraj | సిరాజ్‌కి ఐసీసీ అవార్డ్
టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్‌ని అరుదైన గౌరవం లభించింది. రీసెంట్‌గా ఇంగ్లండ్‌తో జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో సూపర్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టినందుకు గానూ.. సిరాజ్‌ని ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్‌తో సత్కరించింది ఐసీసీ. ఈ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు ఐదు ఆడిన మహమ్మద్ సిరాజ్ 23 వికెట్లతో సత్తా చాటాడు. అతని ప్రదర్శనతో ఈ సిరీస్‌ను భారత్ 2-2తో సమం చేసుకుంది.ముఖ్యంగా ఒవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లో మొత్తం సిరీస్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి 5 వికెట్లు తీసిన సిరాజ్.. టీమిండియాకి 6 రన్స్ తేడాతో విజయాన్నందించాడు. ఇదిలా ఉంటే సిరాజ్ కెరీర్లో ఈ అవార్డ్ అందుకోవడం ఇదే ఫస్ట్ టైం కావడంతో సిరాజ్ ఫుల్ ఖుషీ అవుతున్నాడు. ఈ అవార్డ్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని.. తానాడిన మోస్ట్ థ్రిల్లింగ్ టోర్నీల్లో ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఒకటని, ఆ టోర్నీలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం, టీమ్ విన్నింగ్‌లో కీ రోల్ పోషించడం గర్వంగా ఉందని సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఇక ఇండియన్ క్రికెటర్స్‌లో ఓవరాల్‌గా ఈ అవార్డ్‌ని అందుకున్న 9వ క్రికెటర్‌గా సిరాజ్ నిలిచాడు. అతని కన్నా ముందు రిషభ్ పంత్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, జస్‌ప్రీత్ బుమ్రా ఈ అవార్డ్ అందుకున్నారు. ఇందులో శుభ్‌మన్ గిల్ ఒక్కడే నాలుగు సార్లు ఈ అవార్డు అందుకోగా.. బుమ్రా, అయ్యర్ రెండేసి సార్లు ఈ అవార్డ్ దక్కించుకున్నారు. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 30 రోజుల్లో మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ఈ అవార్డ్‌కు నామినేట్ చేస్తారు. ఆ తర్వాత ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ప్రతి నెల ఐసీసీ ఈ అవార్డ్ ప్రకటిస్తుంది. ఈ ఏడాది ఈ అవార్డ్ అందుకున్న నాలుగో భారత ఆటగాడు సిరాజ్. ఫిబ్రవరి, జూలైలో గిల్, మార్చిలో శ్రేయస్ అయ్యర్ ఈ అవార్డ్ అందుకున్నారు. భారత్ మినహా మరే జట్టు కూడా ఇన్ని అవార్డ్స్ గెలుచుకోలేదు.
ఆట
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















