అన్వేషించండి
SL vs HK Match Asia Cup 2025 | 11 క్యాచ్ లు వదిలి మ్యాచ్ ఓడిపోయిన హాంగ్ కాంగ్
క్రికెట్లో Catches wins matches అంటారు. అంటే ఓ మ్యాచ్ లో ఒక్క క్యాచ్ వదిలేసినా ఆ మ్యాచ్ చేజారినట్లే అని దీనర్థం. అలాంటిది ఒకే మ్యాచ్ లో 11 క్యాచ్ లు వదిలేస్తే.. ఇక ఆ టీం గెలిచే ఛాన్స్ 1% అయినా ఉంటుందా? సోమవారం జరిగిన శ్రీలంక హాంగ్ కాంగ్ మ్యాచ్ ఇలాగే జరిగింది. ఒకపక్క ఆసియా కప్ 2025 సీజన్లో శ్రీలంక దుమ్మురేపుతూ.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సూపర్ -4 లో దాదాపు అడుగు పెట్టేసింది. కానీ ఇంకోపక్క హాంగ్ కాంగ్.. ఫస్ట్ మ్యాచ్ కంటే దారుణమైన performance తో రెండో మ్యాచ్ కూడా ఓడిపోయి టోర్నీ నుంచి బయటికెల్లిపోయింది. మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హాంగ్ కాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 149 పరుగులు చేసింది. ఓపెనర్ అన్షీ రత్ 48 రన్స్, నిజకత్ ఖాన్ 52 నాటౌట్ టాప్ స్కోరర్లుగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో చమీరా 2 వికెట్లు, హసరంగా, షనక చెరో వికెట్ తీసారు. చేజింగ్ లో శ్రీలంక.. ఓపెనర్ పాతుమ్ నిస్సంక 68 రన్స్ చేసి హాఫ్ సెంచరీ తో అదరగొట్టాడు. ఇక చివర్లో.. కుశాల్ పెరెరా, వానిందు హసరంగా చేరో 20 పరుగులతో పించ్ హిట్టింగ్ చేయడంతో లంక టీం 18.5 ఓవర్లలోనే 6 వికెట్ల కోల్పోయి 153 పరుగులు చేసి మ్యాచ్ గెలిచేసింది. అయితే విచిత్రం ఏంటంటే ఈ మ్యాచ్ లో ప్రతి శ్రీలంక batter ఇచ్చిన catch ని Hong Kong ఫిల్టర్లు కనీసం 2 సార్లు వదిలేశారు. ముఖ్యంగా శ్రీలంక హాఫ్ సెంచరీ హీరో నిస్సంక ఇచ్చిన 5 క్యాచ్ లని నేలపాలు చేశారు. మొత్తంగా మ్యాచ్ లో 11 క్యాచ్ లు వదిలేశారు. ఫలితంగా మ్యాచ్ ఓడిపోయారు. ఒకవేళ అందులో సగం క్యాచ్ లు పట్టి ఉన్నా మ్యాచ్ result వేరేలా ఉండేదని Hong Kong ఫ్యాన్స్ బాధపడుతున్నారు. Hong Kong's captain, Yasim Murtaza, కూడా post-match presentation లో క్యాచ్ లు వదిలేయడం వల్లే తమ టీం మ్యాచ్ ఓడిపోయిందని ఒప్పుకున్నాడు.
ఆట
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
తెలంగాణ
సినిమా





















