అన్వేషించండి

ACB catches big fish: జీతం లక్ష, ఆస్తులు 200 కోట్లు - దోచుకోవడమే ఉద్యోగమనుకున్నాడు...దొరికిపోయాడు !

Telangana ADE: తెలంగాణ విద్యుత్ శాఖ ఏడీఈకి రెండు వందల కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. రోజంతా సోదాలు చేసిన తర్వాత ఆయనను అరెస్టు చేశారు.

ADE Ambedkar found to have illegal assets worth Rs 200 crore:  తెలంగాణ అవినీతి నిరోధక శాఖ .. విద్యుత్ విభాగంలో అతి పెద్ద అవినీతి తిమింగలాన్ని పట్టుకుంది.  మంగళవారం ఉదయం 5 గంటల నుంచి విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) అంబేద్కర్ నివాసం, బంధువుల ఇళ్లపై భారీ సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు  కేసులో ఈ రైడ్స్‌లో రూ.2 కోట్లకుపైగా  నగదు, బంగార ఆభరణాలు, మూడు ప్లాట్లు, గచ్చిబౌలిలో ఒక భవనం, 10 ఎకరాల వ్యవసాయ భూమి, 1,000 చదరపు గజాల ఫామ్‌హౌస్ వంటి ఆస్తులు గుర్తించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, అంబేద్కర్ బెనామీల పేర్లపై ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.200 కోట్లకు పైగా ఉండవచ్చని ఏసీబీ అధికారులు తెలిపారు. 

మొత్తం ఏసీబీ 18 బృందాలుగా విడిపోయి మణికొండలోని అంబేద్కర్ నివాసం, గచ్చిబౌలి, మధాపూర్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లోని బంధువులు, బినామీల ఇళ్లలో తనిఖీలు చేపట్టింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని బినామీ సతీష్ ఇంట్లోనే రూ.2 కోట్ల నగదు  నోట్ల కట్టల రూపంలో పట్టుబడింది. ఈ నగదు అంబేద్కర్ అక్రమ సంపాదనలో భాగమని అధికారులు గుర్తిచారు. సోదాల సమయంలో డాక్యుమెంట్లు, పత్రాలు  పెద్ద ఎత్తున దొరికాయి. 

దొరికిన ఆస్తులు

 -  హైదరాబాద్ మూడు ఖరీదైన ప్లాట్ 
  - గచ్చిబౌలి ప్రాంతంలో ఒక ఖరీదైన భవనం (బంధువు పేరుపై ఉంది).
-    వ్యవసాయ భూములు ,  ఫామ్‌హౌస్**: 
  - సూర్యాపేట్ జిల్లా పెంపహాడ్‌లో 10 ఎకరాల వ్యవసాయ భూమి.
  - అదే ప్రదేశంలో 1,000 చదరపు గజాల్లో ఒక ఫామ్‌హౌస్.
-  రెండు కార్లు 

బ్యాంక్ డిపాజిట్లు,  ఇతర విలువైన వస్తువులు. మొత్తం ఆస్తుల విలువ రూ.200 కోట్లకు పైగా ఉండవచ్చని ప్రాథమిక అంచనా. బినామీల పేర్లపై ఉన్న గృహాలు, స్థలాలు, ఫామ్‌ల్యాండ్‌లు జాబితాను ఏసీబీ రెడీ చేస్తోంది.     

అంబేద్కర్ మణికొండ, నార్సింగ్ డివిజన్లలో ఏడీఈగా పనిచేస్తూ, విద్యుత్ కనెక్షన్లు, చిన్న పనులకు కూడా భారీ లంచాలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాల్స్, థియేటర్లు, వాణిజ్య సంస్థలకు కనెక్షన్లు ఇవ్వడానికి లంచాలు తప్పనిసరిగా డిమాండ్ చేసేవారని, కస్టమర్లను హింసించేవారని ఫిర్యాదులు పెద్ద ఎత్తున ఉన్నాయి.   గతేడాది అవినీతి, డ్యూటీలో లేకపోవడం వంటి కారణాలతో సస్పెన్షన్‌కు గురయ్యారు, కానీ కొన్ని వారాల్లో తిరిగి డ్యూటీకి వచ్చారు. ఈ ఆస్తులు అక్రమ లంచాలతోనే కూడబెట్టబడ్డాయని ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆయనను అరెస్టు చేశారు.                                   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
Telangana Rising 2047: రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
Sabarimala Special Trains: శబరిమలకు 10 ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం
శబరిమలకు 10 ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం
Revanth Reddy On Temples: దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
Advertisement

వీడియోలు

Alphonso Davies | శరణార్థి శిబిరం నుంచి లెజెండరీ ఫుట్‌బాలర్‌ వరకూ.. అల్ఫాన్జో స్టోరీ తెలుసా? | ABP
Virendra Sehwag Comments on Virat Kohli | వైరల్ అవుతున్న సెహ్వాగ్ కామెంట్స్
Hardik Pandya in Ind vs SA T20 | టీ20 సిరీస్‌ లో హార్దిక్ పాండ్య ?
Gambhir vs Seniors in Team India | టీమ్‌ఇండియాలో ఏం జరుగుతోంది?
Ashwin Comments on Team India Selection | మేనేజ్‌మెంట్ పై అశ్విన్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
Telangana Rising 2047: రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
Sabarimala Special Trains: శబరిమలకు 10 ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం
శబరిమలకు 10 ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం
Revanth Reddy On Temples: దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
APPSC Exam Schedula: అభ్యర్థులకు అలర్ట్.. ఎగ్జామ్ డేట్స్ వెల్లడించిన ఏపీపీఎస్సీ, పూర్తి షెడ్యూల్
అభ్యర్థులకు అలర్ట్.. ఎగ్జామ్ డేట్స్ వెల్లడించిన ఏపీపీఎస్సీ, పూర్తి షెడ్యూల్
Merry Christmas 2025 : ఈ 5 దేశాలలో క్రిస్మస్ సందర్భంగా పాటించే  విచిత్రమైన ఆచారాల గురించి ఎప్పుడైనా విన్నారా?
ఈ 5 దేశాలలో క్రిస్మస్ సందర్భంగా పాటించే విచిత్రమైన ఆచారాల గురించి ఎప్పుడైనా విన్నారా?
Honda Activa 110 కొనడానికి 3 పక్కా కారణాలు… దూరంగా ఉండాల్సిన 2 మైనస్ పాయింట్లు
Honda Activa 110 కొనాలా, వద్దా? - మంచిచెడులు తెలుసుకోండి
Men’s Style Guide 2025 : మగవారి స్కిన్ టోన్‌కు సరిపోయే బెస్ట్ కలర్స్.. ఈ షేడ్స్​ తప్పక ట్రై చేయండి
మగవారి స్కిన్ టోన్‌కు సరిపోయే బెస్ట్ కలర్స్.. ఈ షేడ్స్​ తప్పక ట్రై చేయండి
Embed widget