83 Film Update: ప్రపంచకప్ గెలిచిన రోజు పస్తులతో పడుకున్న కపిల్ డెవిల్స్..! ఎందుకో తెలుసా?
ప్రపంచకప్ గెలిచిన రోజు జట్టు సభ్యులు కనీసం భోజనం చేయలేదని, అందరూ పస్తులతో పడుకోవాల్సి వచ్చిందని కపిల్ దేవ్ గుర్తు చేసుకున్నాడు. అసలెందుకు తినలేదో వివరించాడు.
టీమ్‌ఇండియా తొలిసారి ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడిన మధుర క్షణాలను భారతీయులెవ్వరూ మర్చిపోలేరు! ఆనాటి అద్భుత సందర్భాన్ని ఆ తరం వాళ్లు ఆస్వాదించారు. ఈ తరంలో చాలామందికి అప్పటి భావోద్వేగం తెలియదు. అయితే రణ్‌వీర్ సింగ్ నటించిన '83' చిత్రం ఆనాటి అపురూపమైన అనుభవాన్ని ఈ తరం వాళ్లకు తెలియజేయనుంది.
దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేస్తున్న ఈ సినిమాను అప్పటి టీమ్‌ఇండియా క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. చిత్రం చూసిన తర్వాత నాటి కెప్టెన్ కపిల్‌దేవ్ భావోద్వేగానికి గురయ్యారని తెలిసింది. ప్రపంచకప్ గెలిచిన రోజు జట్టు సభ్యులు కనీసం భోజనం చేయలేదని, అందరూ పస్తులతో పడుకోవాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. అసలెందుకు తినలేదో తెలుసా?
Our reel captain, @RanveerOfficial, and his devils are all set to turn cinemas into stadiums!
— 83 (@83thefilm) December 23, 2021
Only 1 Day To 83.#ThisIs83
BOOK YOUR TICKETS NOW!@bookmyshow : https://t.co/O3BDGJrEWX@PaytmTickets : https://t.co/5kHdO3TpMa pic.twitter.com/2UQWVoIZIF
ఫైనల్ మ్యాచ్ గెలిచిన రోజు రాత్రి టీమ్‌ఇండియా సంబరాలు అంబరాన్ని అంటాయి. గెలిచిన క్షణం నుంచి క్రికెటర్లు వేడుకలు జరుపుకోవడం మొదలుపెట్టారు. రాత్రంతా బాటిళ్ల కొద్దీ షాంపేన్ సేవించారట. వీధులన్నీ కలియదిరిగారట. అద్భుతమైన మధుర క్షణాలను అలా గడిపారట. ఒకానొక సమయంలో పార్టీలకయ్యే బిల్లును ఎలా కట్టాలో తెలియక కపిల్‌దేవ్ మదనపడ్డాడని జోక్ చేశాడు. చాలా ఆలస్యం అవ్వడంతో భోజనం కోసం ఎంత వెతికినా దొరకలేదట. రెస్టారెంట్లనీ తిరిగినా ఆహారం లేకపోవడంతో ఆటగాళ్లంతా ఏమీ తినకుండానే పడుకున్నారట. అయినప్పటికీ అందరూ సంతోషంగానే నిద్రపోయారట.
కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన '83' చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్లు, ట్రైలర్లకు మంచి స్పందన లభించింది.
#83TheFilm transport to 1983 connect you emotionally reliving cricket stadium inside theatre.Congrats @kabirkhankk for reminding us history of #indiancricket 🏏 that victory made cricket as religion. @RanveerOfficial & @JiivaOfficial lived as Kapil & Cheeka.Thanks @bharath1 pic.twitter.com/5bxTYMzMQu
— g.balaji (@_gbalaji) December 22, 2021
Also Read: IND vs SA: తొలిటెస్టుకు టీమ్‌ఇండియా జట్టు ఇలాగే ఉండొచ్చు..! విశ్లేషకుల అంచనా ఇదే
Also Read: India vs South Africa: హైదరాబాదీ సిరాజ్‌పై సచిన్ ప్రశంసలు.. ఎందుకంటే?
Also Read: IPL Auction 2022: ఐపీఎల్ వేలం తేదీలు వచ్చేశాయి..! ఫిబ్రవరిలోనే.. బెంగళూరులో
Also Read: Asian Champions Trophy Hockey 2021: పాకిస్థాన్ పై భారత్ గెలుపు.. ఖాతాలోకి కాంస్య పతాకం
Also Read: Virat Kohli Record: సఫారీ సిరీసులో కోహ్లీ బద్దలు కొట్టబోయే రికార్డులివే..! వందో టెస్టు..!