KKR vs LSG Preview: ఈ‘డెన్’ ఎవరిదో! - కోల్‌కతాతో లక్నో కీలక పోరు
IPL 2023: ఐపీఎల్ - 2023 లీగ్ స్టేజ్‌లో నేడు ఆఖరి దశ ఫస్ట్ డబుల్ హెడర్ జరుగనుంది. శనివారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్.. లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.
KKR vs LSG Preview: ఐపీఎల్ - 16 లో నేడు ఆఖరి దశ ఫస్ట్ డబుల్ హెడర్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ - లక్నో సూపర్ జెయింట్స్‌లు తలపడనున్నాయి. ప్లేఆఫ్స్ రేసులో కేకేఆర్ కంటే చాలా బెటర్ పొజిషన్‌లో ఉన్న లక్నో.. నేటి మ్యాచ్‌లో గెలిస్తే (ఢిల్లీ చేతిలో చెన్నై ఓడితే) టాప్ - 2కు చేరే అవకాశముంది. కేకేఆర్ కూడా అధికారికంగా ఇంకా ప్లేఆఫ్స్ నుంచి తప్పుకోకపోవడంతో ఇతర ఫలితాలపై ఆధారపడాలన్నా ఆ జట్టు నేడు ఎల్ఎస్‌జీతో తప్పక గెలవాలి. కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్ వేదికగా నేటి రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరుగనుంది.
లక్నోకు మంచి అవకాశం..
ఐపీఎల్- 16 లో భాగంగా ఇటీవలే ముంబై ఇండియన్స్‌తో కీలక మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోకి వచ్చిన లక్నో.. 13 మ్యాచ్ లలో ఏడు గెలిచి 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. అయితే ఆ జట్టు ఈ మ్యాచ్ లో ఓడితే ఫోర్త్ ప్లేస్‌లోకి పడిపోయే ప్రమాదం ఉంది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. 14 పాయింట్లతో ఉంది. బెంగళూరు చివరి మ్యాచ్ లో గుజరాత్ ను ఓడిస్తే అప్పుడు ఆ జట్టు 16 పాయింట్లకు చేరి.. ముంబై (14 పాయింట్లు) కూడా హైదరాబాద్ ను ఓడిస్తే ఆ జట్టుకు కూడా 16 పాయింట్లు వస్తే అప్పుడు లక్నో.. ఐదో స్థానానికి పడిపోయే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్ లో ఈ డ్రామా అంతటికీ ముగింపు పలికేందుకు కృనాల్ పాండ్యా అండ్ గ్యాంగ్ సిద్ధమైంది.
𝗘𝗸 𝘀𝗵𝗮𝗮𝗺, 𝗘𝗱𝗲𝗻 𝗸𝗲 𝗻𝗮𝗮𝗺 🏟️💜#KKRvLSG | #AmiKKR | #TATAIPL pic.twitter.com/FuK1DH9mXW
— KolkataKnightRiders (@KKRiders) May 20, 2023
కేకేఆర్‌కు లాస్ట్ ఛాన్స్..
ఈ సీజన్‌లో కేకేఆర్.. 13 మ్యాచ్ లలో ఆరు గెలిచి ఏడింట్లో ఓడి 12 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఆ జట్టుకు ప్లేఆఫ్స్ ఛాన్సెస్ గగనమే అయినా అధికారికంగా నిష్క్రమించలేదు. నేటి మ్యాచ్ లో గెలిచినా ఆ జట్టుకు 14 పాయింట్లే వస్తాయి. ప్రస్తుతానికి ఆ జట్టు నెట్ రన్ రేట్ ( -0.256) కూడా మైనస్ లలోనే ఉంది. ఈ మ్యాచ్ లో కేకేఆర్.. లక్నో చేతిలో 103 పరుగుల తేడాతో ఓడితే అధికారికంగా నిష్క్రమించే ప్రమాదం ఉంది. ఎటు చూసినా కేకేఆర్‌కు ఇబ్బందే ఉన్నా గెలిస్తే మాత్రం ఆ జట్టు పాయింట్ల పట్టికలో తన ప్లేస్‌ను కాస్త మెరుగుపరుచుకోవచ్చు.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, అవేశ్ ఖాన్, కృనాల్ పాండ్యా, మార్క్ వుడ్, క్వింటన్ డి కాక్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, కృష్ణప్ప గౌతమ్, డేనియల్ సామ్స్, అమిత్ మిశ్రా, కైల్ మేయర్స్, జయదేవ్ ఉనద్కత్, కరుణ్ నాయర్, రొమారియో షెపర్డ్, నవీన్-ఉల్-హక్, యష్ ఠాకూర్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోని, యుధ్వీర్ సింగ్ చరక్, కరణ్ శర్మ, మయాంక్ యాదవ్
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు: నితీష్ రాణా, రహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్, మన్‌దీప్ సింగ్, లిటన్ దాస్, కుల్వంత్ ఖేజ్రోలియా, డేవిడ్ వైస్, సుయాష్ శర్మ, వైభవ్ అరోరా, ఎన్ జగదీశన్