ఎంతో అందమైన ఈ వైజాగ్ వ్యూ పాయింట్ గురించి మీకు తెలుసా..?
విశాఖపట్నం అనగానే మొదటగా గుర్తొచ్చేది బీచ్.. ఇంకా సినిమా షూటింగ్లకు అందమైన ప్రాంతాలు. ఒక పక్కన సముద్రం మరో పక్కన కొండ.. మధ్యలో దారి. ఈ అరుదైన ఆర్కే బీచ్ కన్నా వ్యూ పాయింట్ అనేది ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ ఇక్కడ సినిమాల షూటింగ్‌లు జరుగుతున్నాయి. అందమైన ప్రకృతి, చుట్టూ కొండలు. ఓసారి అక్కడికి వెళ్తే తిరిగి రావాలనిపించదు. మరో చరిత్ర సినిమా ఎంత హిట్ తో మనందరికీ తెలుసు. ఆ సినిమా లైన్ ఈ పాయింట్ నుంచే తీయడంతో ఫేమస్ అయిందని స్థానికంగా చెప్తూ ఉంటారు. చాలెంజ్ సినిమా వచ్చిన తర్వాత మరికాస్త అది ఫేమస్ అయింది.. ఈ ప్లేస్. ఇదంతా బాగానే ఉంది. టూరిస్ట్‌లు వస్తున్నారు. అక్కడి అందాల్ని ఆస్వాదిస్తున్నారు. వచ్చిన వాళ్లే మళ్లీ మళ్లీ ఆ అనుభూతి కోసం వస్తున్నారు. కానీ...అభివృద్ధి విషయంలో మాత్రం లోటు కనబడుతూనే ఉంది. అందుకే..మరికొంచెం అభివృద్ధి గాని చేస్తే ఇది చాలా బాగుంటుంది అని స్థానికంగా చెబుతున్నారు.