![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
CSK vs KKR Preview: చెన్నై టార్గెట్ నెంబర్ వన్ - కోల్‌కతాకు ఆఖరి అవకాశం
IPL 2023: పాయింట్ల పట్టికలో ప్రస్తుతానికి రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్.. కోల్‌కతాను ఓడిస్తే గుజరాత్ టైటాన్స్‌ను వెనక్కి నెట్టి టాప్ -1 పొజిషన్‌కు చేరుకుంటుంది.
![CSK vs KKR Preview: చెన్నై టార్గెట్ నెంబర్ వన్ - కోల్‌కతాకు ఆఖరి అవకాశం IPL 2023 CSK vs RR: Chennai Super Kings Eye On Top Spot, Ready To Face Kolkata Knight Riders Tonight at Chepauk CSK vs KKR Preview: చెన్నై టార్గెట్ నెంబర్ వన్ - కోల్‌కతాకు ఆఖరి అవకాశం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/14/540a3a7b25983ecf8c02a88ce8601b281684038706074689_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CSK vs KKR Preview: ఐపీఎల్ -16 లో నేడు ఈ లీగ్ లో ఫోర్ టైమ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. రెండుసార్లు విజేత కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడనుంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతానికి రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్.. కోల్‌కతాను ఓడిస్తే గుజరాత్ టైటాన్స్‌ను వెనక్కి నెట్టి టాప్ -1 పొజిషన్‌కు చేరుకవడమే గాక ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న తొలి జట్టుగా నిలిచే అవకాశం ఉంటుంది. ఆ మేరకు నేటి రాత్రి 7.30 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ లో గెలవాలని ధోని సేన పట్టుదలతో ఉంది.
ఎదురేలేని ధోని సేన..
గత సీజన్ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న ధోని సేన ఈ సీజన్ లో బ్యాటింగ్ బౌలింగ్ లలో అద్భుతాలు చేస్తున్నది. ఓపెనర్లుగా రుతురాజ్, కాన్వేలు మంచి టచ్ లో ఉన్నారు. వన్ డౌన్ లో వచ్చే రహానే, ఆ తర్వాత హిట్టర్ దూబేలు మిడిల్ ఓవర్స్ లో సీఎస్కే స్కోరు వేగాన్ని పెంచుతున్నారు. రాయుడు ఇప్పటివరకూ పెద్దగా ప్రభావం చూపకపోయినా జడేజా, ధోనిలు ఆఖర్లో భారీ మెరుపులతో అలరిస్తున్నారు.
అంతగా అనుభవం లేని బౌలింగ్ లైనప్ తో ధోని మెరుగైన ఫలితాలు రాబడుతున్నాడు. తుషార్ దేశ్‌పాండే, దీపక్ చాహర్‌లు పవర్ ప్లేలో కట్టడి చేస్తే మిడిల్ ఓవర్స్ లో జడేజా, మోయిన్ అలీ, తీక్షణ లు ఆ పని చూసుకుంటున్నారు. ఇక డెత్ ఓవర్లలో చెన్నై బౌలింగ్ బాధ్యతలను పతిరాన అత్యద్భుతంగా మోస్తున్నాడు.
Ready. Steady. Go! 🚂💨 pic.twitter.com/L0vMn8EPMk
— KolkataKnightRiders (@KKRiders) May 14, 2023
కేకేఆర్‌కు లాస్ట్ ఛాన్స్..
ఈ సీజన్ లో కొద్దిరోజుల క్రితం పంజాబ్ తో ముగిసిన మ్యాచ్ లో గెలిచి టాప్ -5 కు వచ్చిన కేకేఆర్ తర్వాత రాజస్తాన్ తో చిత్తుగా ఓడి మళ్లీ 8వ స్థానానికి పడిపోయింది. ఆ జట్టుకు ఇప్పుడు ప్లేఆఫ్స్ ఆశలు లేకున్నా తన స్థానాన్ని మెరుగుపర్చుకునేందుకు పోరాడటమే. ఆ జట్టు లో ఓపెనర్లు జేసన్ రాయ్, గుర్బాజ్ లు వరుసగా విఫలమవుతున్నారు. వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ నితీశ్ రాణాలు ఫర్వాలేదనిపిస్తున్నారు. హిట్టర్ రసెల్ పంజాబ్ తో మ్యాచ్ లో ఆడినా రాజస్తాన్ తో విఫలమయ్యాడు. పినిషర్ రోల్ లో ఒదిగిపోయిన రింకూ సింగ్ మీద ఆ జట్టు మరోసారి కేకేఆర్ భారీ ఆశలు పెట్టుకుంది.
స్పిన్ కు అనుకూలించే చెపాక్ పిచ్ పై కేకేఆర్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సుయాశ్ శర్మ, నితీశ్ రాణా లు చెన్నై బ్యాటర్లను ఏ మేరకు అడ్డుకుంటారనేది ఆసక్తికరం.
చెన్నై గెలిస్తే టాప్ - 1 పొజిషన్ :
ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకునే అవకాశముంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్.. 12 మ్యాచ్ లు (8 గెలిచి) ఆడి 16 పాయింట్లతో టాప్ -1 లో ఉంది. చెన్నై 12 మ్యాచ్ లలో ఏడు గెలిచి 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్ గెలిస్తే చెన్నైకి 17 పాయింట్లు దక్కుతాయి. తద్వారా ప్లేఆఫ్స్ బెర్త్ కూడా ఖాయం చేసుకునే అవకాశాలు మరింత మెరుగవుతాయి.
తుది జట్లు (అంచనా) :
కోల్‌కతా నైట్ రైడర్స్ : జేసన్ రాయ్, రహ్మనుల్లా గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, ఆండ్రీ రసెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి
ఇంపాక్ట్ సబ్ : సుయాశ్ శర్మ
చెన్నై సూపర్ కింగ్స్ : డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, పతిరాన
ఇంపాక్ట్ సబ్ : తుషార్ దేశ్‌పాండే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)