Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Crime News: పట్టపగలే ఓ అపార్ట్‌మెంట్‌లో చోరీ ఘటన కలకలం రేపింది. దుండగుడు కాలింగ్ బెల్ కొట్టి మరీ మహిళ మెడలో చైన్ లాక్కెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
Thief Snatches Chain After Ringing Doorbell In Hyderabad: ఓ దొంగ ముఖానికి మాస్క్ వేసుకుని పట్టపగలే అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులోకి దర్జాగా వచ్చాడు. ఓ ఇంటి ముందు నిలబడి కాలింగ్ బెల్ కొట్టాడు. మహిళ డోర్ తెరవగానే ఆమెతో మాటలు కలిపి ఓ రెండడుగులు లోపలికి వేసి ఆమె మెడలో చైన్ తీసుకుని పరారయ్యాడు. ఈ ఘటనతో షాక్‌కు గురైన మహిళ వెంటనే స్థానికులను అప్రమత్తం చేస్తూ కేకలు వేస్తూ దొంగ వెంట పరుగెత్తింది. అయినా ఫలితం లేకపోయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి పీఎస్ పరిధిలోని హైదర్షికోట్ సన్‌సిటీలోని ఓ అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులోకి గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి వచ్చాడు. ఓ ప్లాట్ ముందు నిలబడి డోర్ బెల్ కొట్టాడు.
కాసేపటికి ఓ మహిళ డోర్ తెరవగా.. మాటలు కలిపి నెమ్మదిగా లోపలకి వెళ్లి ఒక్కసారిగా ఆమె మెడలోని 4 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. దీంతో మహిళ వెంటనే తేరుకుని లబోదిబోమంటూ కేకలు వేస్తూ దొంగ వెంట పరుగెత్తింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలోని అపార్ట్‌మెంట్‌లో పట్టపగలే ఇలా చోరీలకు పాల్పడడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !