అన్వేషించండి

Tirumala Bramhosthavam: తిరుమల గిరుల్లో 66 కోట్ల తీర్థాలు.. బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడ స్నానమాచరిస్తే జ్ఞానం, వైరాగ్యం!

Tirumala News : శ్రీ వేంకటేశ్వరుడి శేషగిరులు వృక్షసంపద, జీవసంపద, జంతుకోటికి ఆలవాలమే కాదు...ఎన్నో పుణ్యతీర్థాలకు నిలయం. బ్రహ్మోత్సవాల సందర్భంగా పుణ్యతీర్థాలపై ప్రత్యేక కథనం..

Tirumala Bramhosthavam:  పుణ్యతీర్థం..అంటే శుభాన్నిచ్చే జలం అని అర్థం. తిరుమల కొండలపై అలాంటి పుణ్యతీర్థాల సంఖ్య వందలు, వేలు, లక్షలు కాదు.. ఏకంగా 66 కోట్లు అని వివరిస్తున్నాయి  బ్రహ్మపురాణం, స్కంధపురాణం.

66 కోట్ల పుణ్యతీర్థాలను ధర్మరతి, జ్ఞానప్రద, భక్తి వైరాగ్య, ముక్తిప్రదం అనే  4 తీర్థాలుగా విభజించారు..  
 
ధర్మరతి తీర్థాలు 

శేషగిరులపై ధర్మరతిప్రద తీర్థాల సంఖ్య 1008. ఈ తీర్థాల్లో ఉన్న జలాన్ని సేవిస్తే ఆధ్యాత్మిక ఆసక్తి కలుగుతుంది. భగవంతుడిపై పూర్తి భక్తివిశ్వాసాలు ఏర్పడతాయి

Also Read: తిరుమల ఆలయంలో ఎన్ని మండపాలున్నాయి..ఏ మండపంలో శ్రీవారికి ఏ క్రతువు నిర్వహిస్తారు!

జ్ఞానప్రద తీర్థాలు

జ్ఞానప్రద తీర్థాల సంఖ్యం 108...ఈ తీర్థాల్లో జలాన్ని సేవిస్తే జ్ఞానయోగం సిద్ధిస్తుంది. అవేంటంటే..
1.⁠మను తీర్థం 2. ఇంద్ర 3. వసు 4. రద్ర (11) 5. ఆదిత్య (12) 27. ప్రజాపతి (9) 36. అశ్విని 37. శుక్ర 
38. వరుణ్‌ 39. జాహ్నవి 40. కాపేయ 41. కాణ్వ 42. ఆగ్నేయ 43. నారద 44. సోమ 45. భార్గవ 46. ధర్మ 
47. యజ్ఞ 48. పశు 49. గణేశ్వర 50. భౌమాశ్వ 51. పారిభద్ర 52. జగజాడ్యహర 53. విశ్వకల్లోల 54. యమ 
55. భారస్పత్య 56. కామహర్ష 57. అజామోద 58. జనేశ్వర 59. ఇష్టసిద్ధి 60 కర్మసిద్ధి 61. వట 62. జేదుంబర
63. కార్తికేయ 64. కుబ్జ 65. ప్రాచేతస (10) 75. గరుడ 76. శేష 77. వాసుకి 78. విష్ణువర్థన 79. కర్మకాండ 
80. పుణ్యవృద్ధి 81. ఋణవిమోచన 82. పార్జన్య 83. మేఘ 84. సాంకర్షణ 85. వాసుదేవ 86. నారాయణ
87. దేవ 88. యక్ష 89. కాల 90. గోముఖ 91. ప్రాద్యుమ్న 92. అనిరుద్ధ 93. పిత్రు 94. ఆర్షేయ 95. వైశ్వదేవ 
96. స్వధా 97. స్వాహా 98. అస్థి 99. ఆంజనేయ 100. శుద్ధోదక 101. అష్ట భైరవ (8)

Also Read: ఏడాదిలో రోజుల సంఖ్య కన్నా తిరుమలేశుడి ఉత్సవాల సంఖ్యే ఎక్కువ!

భక్తి వైరాగ్యప్రద తీర్థాలు

జ్ఞానపద తీర్థాల కన్నా భక్తి వైరాగ్యప్రద తీర్థాలు అత్యంత శ్రేష్టమైనవి. ఇక్కడ జలాన్ని సేవిస్తే సంసార వైరాగ్యం, దైవభక్తి పెరుగుతుంది. ఇవి మొత్తం 68 తీర్థాలు
1.⁠ చక్ర 2. వజ్ర 3. విష్వక్సేన 4. పంచాయుధ 5. హాలాయుధ 6. నారసింహ 7. కాశ్యప 8. మాన్మధ 9. బ్రహ్మ 10. అగ్ని 
11. గౌతమి 12. దైవ 13. దేవం 14. విశ్వామిత్ర 15. భార్గవ 16. అష్టవక్ర 17. దురారోహణ 18. భైరవ, (పిశాచవిమోచనము) 
19. మేహ (ఉదరవ్యాధి నాశనం) 20. పాండవ 21. వాయు 22. అస్థి (పునరుజ్జీవన సాధనము) 23. మార్కండేయు (ఆయువృద్ధి) 
24. జాబాలి 25. వాలభిల్య 26. జ్వరహర (సర్వజ్వరనాశనం) 27.విషహర (తక్షక విషవ్యాధి నివారకం) 28. లక్ష్మి 29. ఋషి 
30. శతానంద 31. సుతీక్షక 32. వైభాండక 33. బిల్వ 34. విష్ణు 35. శర్వ 36. శారభ 37 బ్రహ్మ 38. ఇంద్ర 39. భారద్వాజ 
40. ఆకాశగంగ 41 ప్రాచేతస 42. పాపవినాశన 43. సారస్వత 44. కుమారధార 45. గజ 46. ఋశ్యశృంగ 47. తుంబురు 
48. థావతారం(10) 58. హలాయుధ 59. సప్తర్షి(7) 66. గజకోణ 67. విశ్వక్సేన 68. యుద్ధసరస్థీ (జయప్రదాయకం)

Also Read: బ్రహ్మోత్సవం అనే పేరెలా వచ్చింది.. దేవతలకు బ్రహ్మోత్సవ ఆహ్వానపత్రం ఎవరిస్తారు!

ముక్తిప్రద తీర్థాలు - సర్వమానవకోటికి ముక్తి సాధనం కూర్చేవి ఈ తీర్థాలు  7 

శ్రీస్వామి పుష్కరిణి  - శ్రీవారి ఆలయానికి ఈశాన్యదిశలో ఉండే పుష్కరిణి సర్వోత్కృష్టమైనదిగా, తీర్థరాజంగా పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో, రధసప్తమి సందర్భాల్లో ఈ తీర్థాల్లో స్నానమాచరించడం పుణ్యప్రదం. ధనుర్మాసంలో ఈ తీర్థాల్లో స్నానమాచరించడం అత్యుత్తమం.
 
కుమారధార  - కుంభమాసంలో మఖానక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజు కుమారధారలో స్నానమాచరించాలి

తుంబుర తీర్థం - మీన మాసంలో ఉత్తర పాల్గుణీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజు ఈ తీర్థంలో స్నానమాచరించడం శుభప్రదం

రామకృష్ణ తీర్థం - మకర మాసంలో పుష్యమి నక్షత్రాయుత పౌర్ణమి రోజు ఈ తీర్థంలో పవిత్రస్నానం  చేయాలి

ఆకాశగంగ - మేష మాసం చిత్తా నక్షత్రయుత పౌర్ణమి విశిష్టమైనది 

పాపవినాశనం - ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో ఉత్తరాఢ నక్షత్రాయుత సప్తమి ఆదివారం లేదా ఉత్తరాభాద్ర నక్షత్రాయుత ద్వాదశి మంచి రోజు

పాండవ తీర్థం (గోగర్భం) -  వృషభమాసంలో శుద్ధ ద్వాదశి ఆదివారము లేదా బహుళ ద్వాదశి మంగళవారం సంగమకాలం అత్యంత పర్వదినం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనేసీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget