అన్వేషించండి

Donald Trump: అమెరికాలోకి అక్రమ వలసలను అరికట్టాం: డొనాల్డ్ ట్రంప్​

అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలు భారీగా తగ్గినట్లు యూఎస్​ అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు. ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో వలసలు తగ్గాయని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.

Trump on Illegal Immigration: అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలు భారీగా తగ్గినట్లు యూఎస్​ అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు. ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో వలసలు తగ్గాయని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. తాను విధించిన కఠినమైన ఇమిగ్రేషన్ విధానాలతో ఫిబ్రవరిలో అక్రమ వలసల సంఖ్య చరిత్రలోనే అతి తక్కువ స్థాయికి చేరాయని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో సరిహద్దుల్లో కేవలం 8,326 మంది అక్రమ వలసదారులు మాత్రమే పట్టుబడ్డారని పేర్కొన్నారు. అక్రమ వలసదారుల సంఖ్య గణనీయంగా తగ్గిందని, తమ దేశంపై వలసల దండయాత్ర ముగిసిందన్నారు.

బైడెన్​ అధికారంలో ఉన్నప్పుడు నెలకు 3 లక్షలమంది 
మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ అధికారంలో ఉన్న సమయంలో ప్రతినెలా దేశంలోకి 3 లక్షలమంది అక్రమంగా ప్రవేశించేవారని పేర్కొన్నారు. ఈ గణాంకాలకు సంబంధించి సీబీపీ రిలీజ్​ చేసిన నివేదికలను ప్రస్తావించారు. దాదాపు 95 శాతం వలసలు తగ్గినట్లు వెల్లడించారు. ‘యూఎస్–మెక్సికో సరిహద్దు వద్ద బోర్డర్ పెట్రోల్ ద్వారా కేవలం 8,326 మంది అక్రమార్కులు మాత్రమే పట్టుబడ్డారు. వారందరినీ వెంటనే మా దేశం నుంచి పంపించాము. అమెరికాకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలపై విచారణ జరుపుపుతున్నాం’ అని ఎక్స్​లో రాసుకొచ్చారు. 

అక్రమ వలసలకు చెక్​ పెట్టాం
తన పాలనలో అక్రమ వలసలకు చెక్​ పెట్టామని ట్రంప్​ ఉద్ఘాటించారు. అక్రమ వలసలకు సరిహద్దులను క్లోజ్​ చేశామన్నారు. ఎవరైనా చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే పెద్ద మొత్తంలో జరిమానాలు, తక్షణ బహిష్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్​ హెచ్చరించారు.

తప్పుబట్టిన వార్తా సంస్థలు
ట్రంప్‌ ప్రకటనను పలు వార్తా సంస్థలు తప్పుబట్టాయి. ఆయన చూపిన గణాంకాలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని దుయ్యబట్టాయి. అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసిన డేటాను ఫాక్స్ న్యూస్ పంచుకుంది. బైడెన్‌ అధికారంలో ఉన్న చివరి వారంలో రోజుకు యావరేజ్​గా 2,869 మందితో దాదాపు 20,086 మంది అక్రమ వలసదారులను గుర్తించినట్లు స్పష్టం చేసింది. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన మొదటి వారంలో 7,287 మంది పట్టుబడ్డారని పేర్కొంది. ఇది 95 శాతం తగ్గుదల కాదని, కేవలం 60శాతం మాత్రమేనని వెల్లడించింది. 

స్వదేశాలకు సాగనుంపుతున్న అధికారులు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్​ ట్రంప్​ రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్‌ కొనసాగుతోంది. అక్రమంగా వలస వెళ్లిన కొందరు భారతీయుల్ని ఇప్పటికే సైనిక విమానాల్లో వెనక్కి పంపించింది. ఇండియన్స్​తోపాటు మరికొంతమందిని కూడా తమ దేశాలకు పంపించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
Soyam Bapu Rao: ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget