Sankranthiki Vasthunam On Zee5 OTT: జీ 5కి డబ్బులే డబ్బులు... ఓటీటీలోనూ రికార్డులు - కాసులు కురిపించిన 'సంక్రాంతికి వస్తున్నాం'
Sankranthiki Vasthunam OTT Streaming Records: వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'సంక్రాంతికి వస్తున్నాం' థియేటర్లలో భారీ హిట్ సాధించింది. ఓటీటీల్లోనూ రికార్డుల వేట మొదలుపెట్టింది.

విక్టరీ వెంకటేష్ (Venkatesh) ప్రయాణంలో 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunam) ఒక మెమొరబుల్ సినిమా. కథానాయకుడిగా ఆయన కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్ అది. బాక్స్ ఆఫీస్ బరిలో ఈ సినిమా మూడు వందల కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడీ సినిమా సినిమా ఓటీటీలోకి వచ్చింది. డిజిటల్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫార్మ్‌కు ఈ సినిమా కాసులు కురిపించింది.
ఒక్క రోజులో 25 వేల సబ్‌స్క్రిప్షన్స్!
Zee5 OTT Subscription: ఒక్క రోజులో 25 వేలు... అక్షరాలా 25 వేల మంది 'జీ 5' ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారని తెలిసింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలోకి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా విడుదల అయ్యింది. మార్చి 1న ఓటీటీలోకి వచ్చింది. 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది.
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా స్ట్రీమింగ్ డేట్ రోజున (మార్చి 1న) సుమారు 25 వేల మంది జీ 5 సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడంతో ఈ సినిమా మీద తెలుగు ప్రజల్లో ఎంత క్రేజ్ ఉందనేది మరోసారి అర్థం అవుతోంది. ఈ సినిమా దెబ్బకు 'జీ 5' చూసే జనాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.
Also Read: విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్
ZEE5 sold 25k new subscriptions yesterday during the #SankranthikiVasthunam streaming event. 🔥
— idlebrain jeevi (@idlebrainjeevi) March 2, 2025
This is significant, as ZEE5 isn't typically seen as a mainstream OTT platform like Netflix or Amazon Prime Video, nor a regional one like AHA.
ఆరు గంటల్లో ఏడు లక్షణ వ్యూస్...
70 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
Sankranthiki Vasthunam OTT Records: 'జీ 5' ఓటీటీలో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా స్ట్రీమింగ్ మొదలైన ఆరు గంటల్లో రికార్డు వ్యూస్ సాధించింది. ఏడు లక్షల మంది సినిమా చూశారని ఓటీటీ వర్గాలు పేర్కొన్నాయి. అంతే కాదు... ఈ సినిమా టోటల్ స్ట్రీమింగ్ మినిట్స్ 70 మిలియన్స్ దాటిందట. తమ ఓటీటీలో బిగ్గెస్ట్ ఓపెనర్ 'సంక్రాంతికి వస్తున్నాం' అని 'జీ 5' పేర్కొంది.
Also Read:ప్రభాస్ - ప్రశాంత్ వర్మ సినిమాలో హీరోయిన్ ఆ అమ్మాయే... ఫస్ట్ మూవీ ఫ్లాపైనా ఫుల్ ఆఫర్స్!
#SankranthikiVasthunam OTT streaming numbers are coming out.
— idlebrain jeevi (@idlebrainjeevi) March 2, 2025
6 hours data:
7 lakh views and 70 million viewing minutes
That’s sensational.
ZEE5 has taken a big risk by buying this movie at a fancy rate and results are fantastic 🔥
వెంకటేష్ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి ఇంతకు ముందు 'ఎఫ్ 2', 'ఎస్ 3' సినిమాలు తీశారు. ఆ రెండూ మంచి విజయాలు సాధించాయి. అయితే... ఆ రెండిటిని మించిన బ్లాక్ బస్టర్ సాధించింది 'సంక్రాంతికి వస్తున్నాం'. ఇందులో హీరో భార్యగా ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షి చౌదరి నటించారు. సీనియర్ నరేష్, 'యానిమల్' ఫేమ్ ఉపేంద్ర లిమయే, డైలాగ్ కింగ్ సాయి కుమార్, వీటీవీ గణేష్, శ్రీనివాస్ అవసరాల, మురళీధర్ గౌడ్, 'మాస్టర్' రేవంత్ తదితరులు నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం మీద 'దిల్' రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

