ఇప్పుడు ప్రేక్షకుల కళ్లన్నీ మీనాక్షి చౌదరి మీదే ఉన్నాయి! సైమా ప్రెస్‌మీట్‌లో ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తెలుగులో మీనాక్షి చౌదరి చేసిన సినిమాలు తక్కువే. కానీ, ఆమె ఖాతాలో హిట్ సినిమాలు ఉన్నాయి. 'హిట్', 'ఖిలాడీ', 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాల్లో మీనాక్షి చౌదరి నటించారు. ఇప్పటి వరకు తెలుగులో మీనాక్షి చౌదరి చేసిన సినిమాల్లో 'హిట్' ఒక్కటే హిట్. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న సినిమా 'గుంటూరు కారం'. 'గుంటూరు కారం'లో రెండో కథానాయికగా మీనాక్షి చౌదరి ఎంపిక అయ్యారు. మహేష్ 'గుంటూరు కారం'తో పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'మట్కా' సినిమా కూడా చేస్తున్నారు మీనాక్షి చౌదరి. వరుణ్ తేజ్ 'మట్కా' కాకుండా విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పుడు మీనాక్షి చౌదరి చేతిలో మూడు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. మీనాక్షి చౌదరి (Image Courtesy : SIIMA 2023 Press Meet)