‘ఖుషి’ రిలీజ్ - స్విమ్మింగ్ పూల్ నుంచే విజయ్ ప్రమోషన్ విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషి' మూవీ సెప్టెంబర్ 1న విడుదలైంది. విడుదలకు ముందే పాటలు, ట్రైలర్ తో ఆడియన్స్లో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ముఖ్యంగా 'ఖుషి' సినిమాలోని పాటలు సినీ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా థియేటర్స్లోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ‘ఖుషి' విడుదలకు కొద్ది గంటల ముందు విజయ్ దేవరకొండ సినిమా గురించి ఓ వీడియోని పోస్ట్ చేశాడు. దాన్ని మీరూ చూసేయండి. 'లైగర్' వంటి భారీ ప్లాప్ తర్వాత 'ఖుషి' తో డీసెంట్ హిట్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం 'గీతా గోవిందం' ఫేమ్ పరశురామ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. Photo credit : Vijay Deverakonda/Instagram