విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషి'లో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి? సినిమా ఎలా ఉంది?

కథ : కశ్మీర్‌లో ముస్లిం అమ్మాయి ఆరా (సమంత)ను చూసి విప్లవ్ (విజయ్ దేవరకొండ) పేమిస్తాడు.

విప్లవ్‌ ప్రేమ చూసి ఆరా కూడా ప్రేమిస్తుంది. తాను ముస్లిం కాదని, బ్రాహ్మిణ్ అమ్మాయి ఆరాధ్య అని చెబుతుంది.

విప్లవ్ తండ్రి లెనిన్ సత్యం (సచిన్ ఖేడేకర్) నాస్తికుడు. ఆరాధ్య తండ్రి చదరంగం శ్రీనివాసరావు (మురళీ శర్మ) ప్రవచన కర్త.

విప్లవ్, ఆరాధ్య ప్రేమకు పెద్దలు ఒప్పుకోరు. వాళ్ళను ఎదిరించి పెళ్లి చేసుకున్నాక ఏమైందనేది సినిమా.

ఎలా ఉంది? : కథ, కథనం కంటే హీరో హీరోయిన్ల నటన, కెమిస్ట్రీ మీద నమ్మకంతో తీసిన సినిమా 'ఖుషి'

'ఖుషి' కథ కొత్తగా అనిపించదు. 'అంటే సుందరానికి' ఛాయలు కనపడతాయి. రన్ టైమ్ కూడా ఎక్కువ.

కథను మర్చిపోయి మరీ తెరపై పాత్రలతో మమేకం అయ్యేలా చేశారు విజయ్ దేవరకొండ, సమంత.

హిషామ్ పాటలు, మురళి విజువల్స్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ రొటీన్ కథను చూసేలా చేశాయి.

పెళ్ళి తర్వాత భార్య భర్తలు ఎలా ఉండాలో చెప్పే చిత్రమిది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చుతుంది.

Thanks for Reading. UP NEXT

'ఖుషి' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత - ఎన్ని కోట్లకు అమ్మారు?

View next story