శ్రీలంక సుందరి, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫుల్ గ్లామర్ షో చేశారు. అది ఎక్కడో తెలుసా? ప్రస్తుతం జాక్వెలిన్ వెనిస్ లో ఉన్నారు. అక్కడికి ఎందుకు వెళ్లారని అనుకుంటున్నారా? వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ కి జాక్వెలిన్ అటెండ్ అయ్యారు. అక్కడ ఈ విధంగా సందడి చేశారు. జాక్వెలిన్ శ్రీలంక అమ్మాయి అయినప్పటికీ... బహ్రెయిన్ లో పెరిగారు. అక్కడ నుంచి బాలీవుడ్ కి వచ్చారు. సల్మాన్ ఖాన్ సహా కొందరు బాలీవుడ్ స్టార్ హీరోలతో జాక్వెలిన్ సినిమాలు చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో'లో స్పెషల్ సాంగ్ కూడా జాక్వెలిన్ చేశారు. సినిమాలతో కంటే సుఖేష్ చంద్రశేఖర్ కేసు వల్ల జాక్వెలిన్ ఎక్కువగా వార్తల్లో నిలిచారు. సుఖేష్ వ్యవహారం పక్కన పెట్టి సినిమాలపై జాక్వెలిన్ ద్రుష్టి సారించారు. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో జాక్వెలిన్ (All Images Courtesy : jacquelienefernandez / Instagram)