By: Arun Kumar Veera | Updated at : 01 Mar 2025 01:25 PM (IST)
రూ. 23.48 లక్షల కోట్ల విలువైన 1700 కోట్ల లావాదేవీలు ( Image Source : Other )
Record 1700 Crore UPI Transactions In January 2025: UPI (Unified Payments Interface) లావాదేవీల పరంగా భారతదేశం ఎప్పటికప్పుడు కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. UPI లావాదేవీలలో మళ్ళీ కొత్త రికార్డ్ నమోదైంది, జనవరిలో దాదాపు 1,700 కోట్ల లావాదేవీలు జరిగాయి.
2025 జనవరి నెలలో, మొదటిసారిగా, UPI లావాదేవీలు 16.99 బిలియన్లను దాటాయి. వాటి మొత్తం విలువ కూడా రూ. 23.48 లక్షల కోట్లను దాటింది. యూపీఐని ప్రారంభించిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు, ఏ నెలలోనైనా జరిగిన అత్యధిక UPI లావాదేవీల సంఖ్య ఇదే. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు (01 ఏప్రిల్ 2024 - 31 జనవరి 2025 కాలంలో) డిజిటల్ చెల్లింపులలో అపారమైన పెరుగుదల కనిపించింది.
UPI లావాదేవీల్లో రిటైల్ చెల్లింపుల వాటా 80%
భారతదేశంలో డిజిటల్ లావాదేవీల ముఖచిత్రాన్ని UPI పూర్తిగా మార్చేసింది. చదువు రాని వాళ్లు సులభంగా ఉపయోగించేలా UPI వ్యవస్థ ఉండడంతో, ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 80 శాతం రిటైల్ చెల్లింపులు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. దీనిని బట్టి, ఈ వ్యవస్థ జనంలోకి ఎంతగా చొచ్చుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు. గత ఆర్థిక సంవత్సరం 2023-24లో, 131 బిలియన్లకు పైగా UPI లావాదేవీలు జరిగాయి, వాటి మొత్తం విలువ రూ. 200 లక్షల కోట్లకు పైగా ఉంది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, బ్యాంకులు & ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌ల నెట్‌వర్క్ పెరుగుతోంది, దేశవ్యాప్తంగా మిలియన్ల మంది యూజర్లు ఇష్టపడుతున్న చెల్లింపు పద్ధతిగా UPI మారింది. 2025 జనవరి నాటికి, 80కి పైగా UPI యాప్‌లు (బ్యాంక్ యాప్‌లు & థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్లు), 641 బ్యాంకులు UPI వ్యవస్థలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయి.
ఇది లావాదేవీల పరిమాణం
2024-25 ఆర్థిక సంవత్సరంలో జనవరి 31వ తేదీ వరకు, మొత్తం UPI లావాదేవీల పరిమాణంలో P2M (వ్యక్తి నుంచి వ్యాపారికి) లావాదేవీల వాటా 62.35 శాతంగా; P2P (వ్యక్తి నుంచి వ్యక్తికి) లావాదేవీలు 37.65 శాతంగా ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జనవరి జరిగిన మొత్తం P2M లావాదేవీల్లో 86 శాతం లావాదేవీలు రూ. 500 లోపులోనే ఉండడం విశేషం. చిన్న మొత్తంలో చేసే చెల్లింపుల విషయంలో UPI మీద ప్రజలు ఎంత నమ్మకం ఉంచారో దీనిని బట్టి అర్థమవుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
మరో ఆసక్తికర కథనం: రూ.87000కు దిగొచ్చిన పసిడి రేటు - మీ ఏరియాలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
ఈ దేశాలలోనూ UPI లావాదేవీలు
భారతదేశంలో అమలవుతున్న యూపీఐ వ్యవస్థ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది, ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ వ్యవస్థ ప్రారంభమైంది కూడా. ప్రస్తుతం.. యనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ వంటి దేశాలలో యుపీఐ ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. దీనివల్ల, భారతీయులు రియల్ టైమ్‌లో అంతర్జాతీయ స్థాయిలో చెల్లింపులు చేయడానికి వీలవుతోంది. మరికొన్ని దేశాలు కూడా యూపీఐపై ఆసక్తిగా ఉన్నాయి.
మరో ఆసక్తికర కథనం: '1996 పీడకల' రిపీట్ అవుతుందా, 30 ఏళ్ల రికార్డ్ బద్ధలవుతుందా? - స్టాక్ మార్కెట్‌లో ఒకటే టెన్షన్
Education Loan: రూ.50 లక్షల విద్యారుణంపై టాప్-10 బ్యాంకుల్లో తాజా వడ్డీ రేట్లు ఇవీ
Home Loan EMI Calculator: రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే ఎంత EMI చెల్లించాలి, EMIని ఎలా లెక్కిస్తారు?
Gold-Silver Prices Today 18 Mar: మళ్లీ భారీ జంప్, కొత్త రికార్డ్ కొట్టిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
House Rates In Hyderabad: రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు హాట్ డెస్టినేషన్ హైదరాబాద్ - రేట్లు 128 శాతం జంప్
Car Price Hike: కార్ కొనాలకుంటే వెంటనే తీసుకోండి, ఇంకొన్ని రోజులే ఈ రేట్లు - లేట్ చేస్తే బాధపడతారు
TG High Court: రూ.1 కోటి జరిమానా విధించిన తెలంగాణ హైకోర్టు, తప్పుదోవ పట్టిస్తావా అంటూ పిటిషనర్‌పై ఆగ్రహం
Nara Lokesh: ఏపీలో మరిన్ని విదేశీ యూనివర్సిటీల క్యాంపస్‌లు ఏర్పాటు: నారా లోకేష్
Sushanth Anumolu: సుశాంత్ బర్త్ డే ట్రీట్... కొత్త మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సర్ప్రైజ్... సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్‌గా SA10
Prithvi Shaw Down Fall: పృథ్వీ షా గురించి కీలక వ్యాఖ్యలు చేసిన ఐపీఎల్ స్టార్ శశాంక్ సింగ్.. అవి మార్చుకుంటే, తనకు తిరుగేలేదు..!