అన్వేషించండి

Case Against YouTuber: గోల్డ్ హంట్ పేరిట వెర్రి వేషాలేశాడు.. కేసుల్లో ఇరుక్కున్నాడు..! ఏపీలోనే ఇన్సిడెంట్

ఫాలోవ‌ర్స్‌ను పెంచుకునేందుకు ఇన్‌స్టాలో ర‌క‌ర‌కాల ఫీట్లు చేస్తున్నారు కొంద‌రు.. ఇలాగే గోల్డ్ హంట్ పేరుతో చేసిన ఓ వెర్రి వేషానికి చివ‌ర‌కు కేసుల్లో ఇరుక్కున్నాడు మంద‌పాటి ఆదిత్య అనే యూట్యూబ‌ర్‌..

Gold Hunt in Stadium | రాజమండ్రి: యూట్యూబర్లు, ఇన్‌స్టా రీల్స్ చేసేవారు వ్యూస్ కోసం, ఫాలోవ‌ర్స్ కోసం ఎంత‌కైనా తెగ‌బ‌డుతున్నారు.. యూట్యూబ్‌లో స‌బ్‌స్క్రెబ‌ర్ల కోసం, ఇన్‌స్టాలో ఫాలోవ‌ర్స్ కోసం వెర్రివేషాలేస్తున్నారు.. గోల్డ్ హంట్‌, మ‌నీ హంట్ పేరుతో చిత్ర‌మైన పోటీలు పెట్టి ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల పాలు గురిచేస్తున్నారు.. వీరి మాయ‌లో ప‌డిపోతున్న ప్ర‌జ‌లు వారు చెప్పిందే నిజమని ఉరుకులు పరుగులెత్తుతున్నారు.. సోష‌ల్ మీడియా ఇన్ఫ్యులెన్స‌ర్లుగా ఉన్న‌వారు బెట్టింగ్ యాప్‌ల‌ను స‌మాజాన్ని త‌ప్ప‌దోవ ప‌ట్టిస్తుంటే ఫాలోవ‌ర్స్‌ను పెంచుకునేందుకు కొంత మంది వికృత చేష్ట‌లు చేస్తూ గంద‌ర‌గోళాన్ని సృష్టిస్తున్నారు.  

మనీ హంట్, గోల్డ్ హంట్ పేరుతో ఈ మధ్య కాలంలో ప్రజలను తప్పుదోవ పట్టించిన ఘటనలు  చాలానే వెలుగు చూశాయి.. చివ‌ర‌కు పోలీసులు కూడా జోక్యం చేసుకోవాల్సిన ప‌రిస్థ‌తి చూడాల్సి వ‌చ్చింది..  స‌రిగ్గా ఇలాగే ఓ యూట్యూబ‌ర్ త‌న ఇన్‌స్టా పేజిలో గోల్డ్ హంట్ పేరుతో ఓ ప్ర‌భుత్వ క్రీడా ప్రాంగ‌ణంలో చేసిన అల‌జ‌డికి అధికారులు ఆగ్ర‌హాన్ని చ‌విచూడాల్సిన ప‌రిస్థ‌తి ఎదుర్కొన్నాడు.. జిల్లా క‌లెక్ట‌ర్ సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసి చ‌ర్య‌లకు ఆదేశించిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వ క్రీడా ప్రాంగ‌ణ అధికారి ఫిర్యాదుపై స‌ద‌రు యూట్యూబ‌ర్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.. 

బాల‌యోగి క్రీడా ప్రాంగ‌ణంలో గోల్డ్ పెట్టానంటూ..

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమ‌లాపురం క‌లెక్ట‌రేట్‌కు కూత‌వేటు దూరంలో ఉన్న జీఎంసీ బాల‌యోగి క్రీడా ప్రాంగ‌ణంలో పిబ్ర‌వ‌రి 28న‌ భూమిలో వెండి, బంగారం,  ఇయర్ పాడ్స్ దాచాను దొరికిన వాళ్లు తీసుకోండి అంటూ మందపాటి ఆదిత్య అనే యూట్యూబర్ త‌న ఇన్‌స్టా పేజ్‌లో ముందు రోజు రీల్ పోస్ట్ చేశాడు. ఫస్ట్ ప్రైజ్ కింద గోల్డ్, రెండో ప్రైస్ కింద వెండి ఉంగరం, మూడో ప్రైజ్ కింద ఇయర్ బర్డ్స్ ఇస్తానని నమ్మించాడు. 
ఈ వీడియో చూసిన తర్యాత ప్రజలు స్టేడియం వద్దకు పరుగులు తీశారు. అయితే వెండి, బంగారం, ఇయర్ పాడ్స్ కోసం 100 మందికి పైగా స్థానిక యువకులు స్టేడియంలో గోతులను తవ్వి వాటిని వెతకడం ప్రారంభించారు.  దీంతో అక్క‌డ ఏం జ‌రుగుతుందో అర్ధం కాక అక్క‌డి ఉద్యోగులు ఒకింత కంగార‌య్యారు.. వంద మందికి పైగా వచ్చి క్రీడా ప్రాంగణంలో గోతులు తవ్వుతున్న యువకులను ఉద్యోగులు అడ్డుకున్నారు. 

క‌లెక్ట‌ర్ ఆగ్ర‌హం.. కేసు న‌మోదు...  
క‌లెక్ట‌రేట్‌కు ఆనుకుని ఉండే స్వ‌ర్గీయ జీఎంసీ బాల‌యోగి క్రీడా ప్రాంగ‌ణంలో ఈ గంద‌ర‌గోళం విష‌యం మొత్తం మీద జిల్లా క‌లెక్ట‌రేట్ వ‌ర‌కు వెళ్లింది.. దీంతో  ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఆరా తీయ‌డంతో ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసి పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల‌ని ఆదేశాలు జారీచేశారు.  పోలీసులు వెంటనే స్డేడియానికి చేరుకుని యూట్యూబర్ మందపాటి ఆదిత్య ను అదుపులోకి తీసుకుని అక్క‌డున్న వారిని బ‌య‌ట‌కు పంపారు.. ఆయనపై రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. గోల్డ్ హంట్ కోసం స్టేడియంలో గోతులు తవ్వడానికి కార‌ణ‌మైన యూట్యూబర్ మందపాటి ఆదిత్యపై క్రీడాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన యూట్యూబర్ మందపాటి ఆదిత్యపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రీడాధికారి పోలీసులను కోరారు.

 

టాప్ హెడ్ లైన్స్

MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
World Tourism Day Arrangements: ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్.. పర్యాటక ప్రాంతాలకు గ్లోబల్ ప్రచారం.. ఇన్‌ఫ్లూయెన్సర్లతో మంత్రి దుర్గేష్ బంతి భోజనాలు
ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్.. పర్యాటక ప్రాంతాలకు గ్లోబల్ ప్రచారం
Janasena Politcis: కూటమి బలంగా నిలబడాలి.. జనసేన గౌరవానికి భంగం వాటిల్లకూడదు: పిఠాపురంలో పవన్ కళ్యాణ్
కూటమి బలంగా నిలబడాలి.. జనసేన గౌరవానికి భంగం వాటిల్లకూడదు: పిఠాపురంలో పవన్ కళ్యాణ్
Deputy CM Pawan Kalyan: పిఠాపురంలో రూ. 6 కోట్లతో 11 చెరువుల సుందరీకరణ.. పీఠికాపుర వనం ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పిఠాపురంలో రూ. 6 కోట్లతో 11 చెరువుల సుందరీకరణ.. పీఠికాపుర వనం ప్రారంభించిన పవన్ కళ్యాణ్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
8th Pay Commission: 8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Embed widget