అన్వేషించండి

Monthly Horoscope for March 2025 : మార్చి నెల ఈ ఏడు రాశులవారికి అంతా అనుకూలం, ఆర్థిక లాభం!

Monthly Horoscope: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. మార్చి నెలలో మీ రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Monthly Horoscope for March 2025 

వృషభ రాశి (Taurus  Monthly Horoscope for March 2025)

మార్చి నెల ఈ రాశివారికి అనుకూల ఫలితాలుంటాయి. వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలున్నాయి. మీ అనుభవాన్ని, నైపుణ్యాన్ని బాగా ఉపయోగించుకోగలుగుతారు. మీ లక్ష్యాలపట్ల విధేయత చూపండి. కుటుంబంలో ప్రేమ, సామరస్య పూర్వక  వాతావరణం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగ నిపుణులకు ఈ నెల చాలా మంచిది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. గృహనిర్మాణ ప్రయత్నాలు చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. సంతోషంగా ఉంటారు. 

Also Read: ఈ మూడు రాశులవారికి మార్చి నెలలో ఊహించని సమస్యలు తప్పవు!

మిథున రాశి (Gemini Monthly Horoscope for March 2025)

మార్చి నెల మిథున రాశివారికి బాగా కలిసొస్తుంది. ఈ నెల ఆర్థికంగా లాభపడతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలు ముబ్బులు విడినట్టు విడిపోతాయి. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. నూతన పరిచయాలు లాభిస్తాయి. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. రాజకీయనాయకులు లాభపడతారు. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. చట్టపరమైన కేసుల విషయంలో విజయం సాధిస్తారు. ఈ నెలలో అప్పులు ఇవ్వొద్దు. రియల్ ఎస్టేట్ సంబంధిత ప్రాజెక్టులలో సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటారు. ఆహారంలో స్వచ్ఛత ఉండేలా చూసుకోండి. శరీరానికి తగినంత నిద్ర అవసరం.
 
కర్కాటక రాశి (Cancer Monthly Horoscope for March 2025)

ఈ నెలలో కర్కాటక రాశివారికి అన్నీ అనుకూల ఫలితాలే ఉన్నాయి. చేసే వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటుంది. గృహనిర్మాణ పనులు కలిసొస్తాయి. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. శత్రువులపై పై చేయి సాధిస్తారు. సంఘంలో పెద్దవారిని కలుస్తారు. ప్రయాణంలో లాభపడతారు. నూతన పరిచయాల వల్ల లాభపడతారు. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ నెల అనుకూలం. ఆదాయాన్ని పెంచే మార్గాలను పరిశీలిస్తారు.  నెల ప్రారంభం మీకు అంత శుభం కాదు. అవివాహితులు వివాహం గురించి ఇంకొంత కాలం ఎదురుచూడాల్సి ఉంటుంది.  

కన్యా రాశి (Virgo Monthly Horoscope for March 2025)

కన్యారాశివారికి మార్చి నెల బాగా కలిసొస్తుంది. ఈనెలలో చేపట్టిన ప్రతి పనిలో మంచి ఫలితాలు పొందుతారు. మనశ్సాంతి ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. కెరీర్ పరంగా ఈ నెల అద్భుతంగా ఉంటుంది. ఈ నెల ఉత్సాహంగా సాగిపోతుంది.  స్నేహితులతో కలసి టూర్ ప్లాన్ చేసుకుంటారు. బలహీనతలు అధిగమించేందుకు ప్రయత్నించండి. వైవాహిక సంబంధాల్లో సాన్నిహిత్యం ఉంటుంది. ఈ నెలలో మీరు తీసుకునే నిర్ణయాల ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ వ్యవహారాల్లో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి. ఇంట్లో మహిళలకు అనారోగ్య సమస్యలుంటాయి. నెలలో చివరి వారం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారంలో మీ భాగస్వాముల ప్రయోజనాలను జాగ్రత్తగా చూసుకోండి.  

తులా రాశి (Libra Monthly Horoscope for March 2025)

ఈ నెలలో వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలు పొందుతారు. నూతన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారి కల ఫలిస్తుంది. దిగుమతి ఎగుమతి వ్యాపారాల్లో లాభాలు ఆర్జిస్తారు. ఈ రాశి రాజకీయ నాయకులకు ప్రజాదరణ పెరుగుతుంది. అన్నీ కలిసొస్తాయి కానీ అదిక కోపం కారణంగా అనుకోని వివాదాల్లో చిక్కుకుంటారు. బంధుమిత్రులతో విరోధాలు పెట్టుకుంటారు. స్త్రీ మూలకంగా ధనం పొందుతారు. వ్యాపారులు ఆశించిన లాభాలు ఆర్జించలేరు. చేతులు, కాళ్లు నొప్పులతో ఇబ్బందిపడతారు. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. సాంకేతిక రంగంలో విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. 

వృశ్చిక రాశి (Scorpio Monthly Horoscope for March 2025)

వృశ్చిక రాశివారికి మార్చి నెల అన్నివిధాలుగా యోగకాలం. చేపట్టిన కార్యాల్లో లాభపడతారు. ఆరోగ్యం బావుంటుంది. ఆదాయం పెరుగుతుంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. సాహిత్యం, కళల పై ఆసక్తి పెరుగుతుంది. న్యాయవాద వృత్తిలో ఉండేవారికి ఈ నెలలో మంచి జరుగుతుంది.  స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. భూ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. నూతన పరిచయాలు లాభిస్తారు. ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోండి.  గొంతు వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పొట్టకు సంబంధించిన సమస్యలుంటాయి.

కుంభ రాశి  (Aquarius Monthly Horoscope for March 2025)

కుంభ రాశివారికి మార్చి నెలలో గ్రహాల అనుకూలత ఉంటుంది. చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలుంటాయి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో మంచి విజయం సాధిస్తారు. వ్యాపార లావాదేవీలు కలిసొస్తాయి. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. ఆదాయానికి లోటుండదు. ప్రయాణ సౌఖ్యం ఉంటుంది. పిల్లల ప్రవర్తన గురించి ఆందోళన చెందుతారు. అబద్ధాలు చెప్పొద్దు. చెడు వ్యక్తులతు దూరంగా ఉండాలి. కోపం తగ్గించుకోవాలి. భార్య భర్త మధ్య అనుకూలత ఉంటుంది

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

Also Read: స్నానం ఎన్నిరకాలు.. నిత్యం చేసే స్నానానికి, దివ్య స్నానానికి ఏంటి వ్యత్యాసం!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!
సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
11-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు! ఏ రాశికి అదృష్టం? ఎవరికి సవాళ్లు?
11-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు! ఏ రాశికి అదృష్టం? ఎవరికి సవాళ్లు?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget