Maha Shivaratri 2024: కైలాసంలో శివుడి సన్నిధిలో ఉన్నామా అనిపించే పాటలివి - వింటే పూనకాలే!
2024 మార్చి 08 మహా శివరాత్రి. ఈ సందర్భంగా బతుకు చిత్రాన్ని కళ్లముందు సాక్షాత్కరించే శివుడి పాటలు మీకోసం. ప్రశాంతంగా ఈ పాటలు వింటే శివుడి సన్నిధిలో ఉన్నట్టే అనిపిస్తుంది భక్తులకు...
Excellent Song Of Lord Shiva:
మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో ఉద్భవించాడని చెబుతారు. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి భక్తిశ్రద్ధలతో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. మహా శివరాత్రి ఈ ఏడాది (2024) మార్చి 08న వచ్చింది. ఈ సందర్భంగా మిమ్మల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తే పాటలతో పాటూ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించే గీతాలు మీకోసం...
గంగాధర శంకర కరుణాకర, పరబ్రహ్మ స్వరూప, భూత ప్రపంచ రహిత అంటూ సాగే ఈ పాటవింటే ఇట్టే లీనమైపోతారు..
Also Read: అందుకే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు అయ్యారు!
ఆటగదరా శివా
జీవిత చిత్రాన్ని చూపించే పాటల్లో ఎక్కువ మందికి కనెక్టైన పాట ఆటగదరా శివా... ఈ పాటలో ప్రతి అక్షరం అద్భుతమే. జనన మరణాలు, పంతం-అంతం, ప్రళయం-ప్రణయం, నలుపు-తెలుపు , మన్ను-మిన్ను లాంటి చిన్న చిన్న పదాలతో జీవితాన్ని తట్టిలేపిన తనికెళ్ల భరణి రచనకు ఏసుదాసు స్వరం తోడైంది..
Also Read: మార్చి 08 శివరాత్రి లోగా ఇది నేర్చేసుకోండి !
ఎట్టాగయ్యా శివా శివా
చావుకి-పుట్టుకకు మధ్యలో అన్నీ ఎదురీతలే.. బంధాలకు ప్రతిమనిషీ బందీనే, అందరికీ వేదన బాధ ఒక్కటే... దయచూడు భోళాశంకరా కరుణ చూపించు అంటూ సాగే ఈ పాట ఆటగదరా శివ సినిమాలోది
Also Read: వయసైపోతున్నా పెళ్లి కాలేదా..అయితే ఈ ఆలయానికి వెళ్లిరండి!
భ్రమ అని తెలుసు
బ్రతుకంటే బొమ్మల ఆట.. పుట్టుక తప్పదు, మరణం తప్పదు..అన్నీ తెలిసి మాయలో బతుకుతున్నాం అంటూ మనిషిలో ఉంటే అంతర్యామిని తట్టిలేపే సాంగ్ ఇది.. జగద్గురు ఆదిశంకరాచార్య సినిమాలోది
Also Read: చివరకు మిగిలేది బూడిదే - లయకారుడు చెప్పేది ఇదే!
మాయేరా అంతా మాయేరా
నీ ముందూ నీ వెనుకా జరిగేదంతా మాయే.. మనవాళ్లు మనది అన్నది మాయే...జననం-మరణం మాయ మధ్యలో జరిగే నాటకం అంతా మాయ..జగమంతా మాయే..జనమంతా మాయే..కళ్లారా చూసే ప్రతిదీ తెల్లారితే మాయే అంటూ సాగే ఈ పాట ఆలోచింపజేస్తుంది
Also Read: రెండు దేహాలు ఒక్కటిగా కనిపించడమే అర్థనారీశ్వర తత్వమా?
నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంత సేపూ
నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంత సేపూ..ఆ తర్వాత నువ్వు దేవుడివి-నేను అంటరానివాడిని , నీ కాలు కిందపెట్టకుండా ఉండేలా నిన్ను గర్భగుడికి చేర్చాను కానీ నీ గుడిలో నన్ను అడుగుపెట్టనివ్వవు, నీ ముందు వెలిగే దీపాల కోసం నేను చెమటడోచ్చాను కానీ మా కొడిగట్టిన బతుకులు మార్చవెందుకు అన్న ఓ శిల్పి ఆవేదన ఆవిష్కరించిన ఈ పాటకు రచన, సంగీతం, గానం అన్నీ చరణ్ అర్జున్...
శివుడిలో కలిసిపోవాలనే తపన ఉంటే ఇలానే ఉంటారేమో...
శివ పంచాక్షరిని ఇప్పటి జనరేషన్ ని అట్రాక్ట్ చేసేలా రూపొందించిన ఈ పాట వింటే పూనకాలే...
శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేసే భక్తులు రాత్రంతా భజనలు చేస్తుంటారు. భజన పాటల్లో ఇదొకటి...
శివుడి గురించి ఎక్కడెక్కడో వెతుకుతారు కానీ పరమేశ్వరుడు జ్యోతి స్వరూపంలో మన హృదయంలోనే కొలువై ఉన్నాడు..అయితే ఆ జ్యోతి కనిపించకుండా చీకటి కమ్మేసింది...ఆ చీకటిని పారద్రోలితేనే అఖండ తేజోమయుడైన పరమేశ్వర స్వరూపం సాక్షాత్కరిస్తుంది. నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు అని సాగే పాట ఇది...