(Source: ECI/ABP News/ABP Majha)
Maha Shivaratri 2024: రెండు దేహాలు ఒక్కటిగా కనిపించడమే అర్థనారీశ్వర తత్వమా?
Ardhanarishvara Tatvam : అర్థనారీశ్వరుడు అనగానే పార్వతీపరమేశ్వరులు ఒకే శరీరంలో కలసి ఉన్న రూపం కళ్లముందు మెదులుతుంది. అంటే శరీరంలో సగభాగం పంచివ్వడమే అర్థనారీశ్వర తత్వమా?
Maha Shivaratri 2024 Ardhanarishvara Tatvam
అర్థ-నారి-ఈశ్వర
అంటే సగం స్త్రీ-సగం పురుషుడు...ఇద్దరూ కలిస్తే అర్థనారీశ్వరుడు అని అర్థం
ఆధునిక శాస్త్ర పరిశోధన ప్రకారం
పదార్థం-చైతన్యం కలయికే సృష్టి. రెండింటినీ తీసుకుని దేవతా స్వరూపాలను కల్పన చేసుకుని ఆరాధిస్తాం. అదే అర్థనారీశ్వర తత్వం. అయితే ఫొటోల్లో చూస్తుంటే రెండు ముక్కలు కలిపినట్టు దేహం కనిపిస్తుంది...ఇది కేవలం అర్థం అయ్యేందుకు మాత్రమే ఇలా రూపకల్పన చేశారు కానీ అర్థనారీశ్వర తత్వం అంటే స్త్రీ-పరుషులు కలసి ఒక్కటే అని అర్థం.
Also Read: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు
సృష్టిలో ప్రతీది రెండు
- పగలు-రాత్రి
- చీకటి-వెలుగు
- సుఖం-దుంఖం
- విచారం-సంతోషం
వీటిలో ఏ రెండూ ఒకేసారి ఉండవు. ఒకటి లేకుండా మరొకటి ఉండవు. రెండింటి సమ్మేళనమే ఒకటిగా మారుతుంది.
- పగలు రాత్రి కలిస్తే రోజు
- సుఖం-దుంఖం కలిస్తే జీవితం
- బొమ్మ-బొరుసు ఉంటే ఓ నాణెం
- ఇలా స్త్రీ-పరుషుడు కలిస్తే సృష్టి అని చెబుతుంది అర్థనారీశ్వరతత్వం
Also Read: శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటే!
అందరూ అర్థనారీశ్వరులే
ప్రతిమనిషి లోనూ అర్థనారీశ్వర తత్వం ఉంటుంది. పిల్లలను తల్లి కన్నా సున్నితంగా పెంచే తండ్రులు ఉంటారు, తండ్రి కన్నా బాధ్యతలు తీసుకునే తల్లులు ఉన్నారు. అంటే స్త్రీ-పురుషులిద్దరిలోనూ స్త్రీ తత్వం-పురుష తత్వం రెండూ ఉంటాయి. అది అర్థం చేసుకోపోవడం వల్లనే అభిప్రాయ బేధాలు వస్తున్నాయి. ఇది గుర్తిస్తే వివక్ష ఉండదు.
అర్థనారీశ్వర తత్వం తెలుసుకోవడం అవసరమే!
ప్రస్తుత సమాజానికి అర్థనారీశ్వర తత్వం అవసరం. తల ఆలోచనకి , పాదం ఆచరణకు సంకేతాలైతే , పార్వతీపరమేశ్వరులు తలనుంచి కాలివరకు..ప్రతి చర్య-ఆలోచనలోనూ సమానంగా ఉంటారని అర్థం. భార్యా భర్త అన్యోన్యంగా ఉంటూ... తప్పు అయినా ఒప్పు అయినా ... ఆచరణలోనూ ,ఆలోచనలోనూ, కర్మలలోను , కార్యాలలోను , నిర్ణయాలలోనూ , నిర్మాణాలలోనూ ఒకటిగా ఉండాలని సూచించే హిందూ ధర్మమే అర్థనారీశ్వర తత్వం.
Also Read: అమ్మవారి వెంటే అయ్యవారు, ఇంత ప్రేమ పొందడం ఎవరికి సాధ్యం!
పురుషుడు 'స్థిరం' - స్త్రీ 'మాయ'
సాధారణంగా పరమేశ్వరుడు స్థిరస్వభావం...తనలో ఎలాంటి మార్పులుండవు. అమ్మవారు మాయా స్వరూపం అంటే మారుతూ ఉంటుంది. సృష్టిలో రెండే శాశ్వతం ఒకటి మారేది మరొకటి మారనిది. స్థిర తత్వం పురుషతత్వం అయితే...మాయా తత్వం స్త్రీ సొంతం. ఇక్కడ మాయాతత్వం అంటే తప్పుగా అర్థం చేసుకుంటారేమో...పురాణాల ఉద్దేశం అది కాదు. మాయ అంటే మార్పు...ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే పురుషుడి చతుర్విద ఆశ్రమాల్లో స్త్రీ అనేక పాత్రలు పోషిస్తుందన్నది ఆంతర్యం.
- పురుషుడి బ్రహ్మచర్యం ఓ స్త్రీ చేయందుకోవడంతో సంపూర్ణమవుతుంది
- ఆమెను భార్యగా స్వీకరించి గృహస్థ ఆశ్రమాన్ని పూర్తిచేస్తాడు పురుషుడు
- వానప్రస్థంలో అంటే 60 ఏళ్ల వయసులో అదే భార్యను తల్లిగా భావిస్తాడు
- ఇక చివరిగా సన్యాస ఆశ్రమం..సన్యాస ఆశ్రమంలో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండకూడదు...దైవారాధన తప్ప మరో ఆలోచన రాకూడదు కానీ ఆ సమయంలో కూడా నాతిచరామి అన్న ప్రమాణం ప్రకారం భార్య చేయి విడిచిపెట్టడం భావ్యం కాదు. అందుకే తన జీవితానికి పరిపూర్ణత కల్పించిన భార్యను పురుషుడు సన్యాస ఆశ్రమంలో అమ్మవారిగా భావిస్తాడు.
ఇలా పురుషుడు ఒక్కడే...కానీ ఒకే స్త్రీ మారుతూ వచ్చింది..అందుకే స్త్రీని మాయాస్వరూపం అని అంటారు. భార్యగా ఆమె ఘనతను గుర్తించే తనలో సగభాగం చేసుకుని అర్థనారీశ్వరిడిగా మారాడు పరమేశ్వరుడు...
Also Read: సరదాగా శివుడి కళ్లు మూసిన పార్వతీ దేవి - ఆ క్షణం ఏం జరిగిందంటే!
మార్చి 8 శివరాత్రి
ఈ ఏడాది మహా శివరాత్రి మార్చి 8 శుక్రవారం వచ్చింది. మార్చి 8 శుక్రవారం రాత్రి 8గంటల 13 నిముషాల వరకూ త్రయోదశి ఉంది... ఆ తర్వాత నుంచి చతుర్థశి ప్రారంభమైంది. మార్చి 9 శనివారం సాయంత్రం 5 గంటల 59 నిముషాల వరకూ చతుర్థశి ఉంది. అయితే శివరాత్రి అంటే లింగోద్భవ సమయానికి చతుర్ధశి ఉండడం ప్రధానం..అందుకే మహాశివరాత్రి మార్చి 8న జరుపుకోవాలి.