Maha Shivaratri 2024 Date: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు
2024 Maha Shivaratri Date: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది? ఆ రోజు ప్రత్యేకత ఏంటి? మిగిలిన దేవుళ్లందరికన్నా శివుడు ఎందుకు ప్రత్యేకం...
![Maha Shivaratri 2024 Date: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు Maha Shivaratri 2024 Date Time and Significance why shiva special than other gods Maha Shivaratri 2024 Date: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/24/f3d89bef74bb5807bbb10be3f27aecf81706072943777217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Maha Shivaratri 2024 Date and Time : భోళాశంకరుడంటే భక్తులు మహాప్రీతి. అందుకే ఆయన్ని ఎంత స్తుతించినా తనివి తీరదంటూ పక్షానికి, మాసానికి, ఏడాదికి ఒక్కో శివరాత్రి పేరుతో శివయ్యను ఆరాధిస్తారు. అన్నటికన్నా విశిష్టమైనది మాఘ బహుళ చతుర్థశి రోజు వచ్చే మహాశివరాత్రి మరింత ప్రత్యేకం. ఈ ఏడాది మహా శివరాత్రి మార్చి 8 శుక్రవారం వచ్చింది...
మార్చి 8 శుక్రవారం రాత్రి 8గంటల 13 నిముషాల వరకూ త్రయోదశి ఉంది... ఆ తర్వాత నుంచి చతుర్థశి ప్రారంభమైంది
మార్చి 9 శనివారం సాయంత్రం 5 గంటల 59 నిముషాల వరకూ చతుర్థశి ఉంది...
అయితే శివరాత్రి అంటే లింగోద్భవ సమయానికి చతుర్ధశి ఉండడం ప్రధానం..అందుకే మహాశివరాత్రి మార్చి 8న జరుపుకోవాలి
Also Read: జనవరి 25 పుష్యమాస పౌర్ణమి - ఈ రోజు విశిష్టత ఏంటి, ఏం చేయాలి!
సృష్టి తత్వాన్ని బోధించే శివయ్య
హిందువులకు శివారాధన మీదున్న మక్కువ నానాటికీ పెరుగుతోందే కానీ తగ్గడం సేదు. పరమేశ్వరుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడనో, మృత్యుంజయుడై ఆరోగ్యాన్ని అందిస్తాడనో కాదు...సృష్టి తత్వాన్ని బోధపరుస్తాడని, సంసార బంధాల నుంచి విముక్తుడిని చేస్తాడనీ , ఆయన తనలో ఐక్యం చేసుకుంటాడని..అందుకు గొప్ప సందేశం మహా శివరాత్రి. సాధారణంగా పండుగలన్నీ పగటిపూట పూజలు, పసందైన పిండివంటలు , కొత్త బట్టలు..ఇలా రోజంతా సందడే సదండి. కానీ శివరాత్రి ఇందుకు విరుద్ధం. ఈ రోజు..ఉపవాసం, జాగరణతో, రాత్రివేళ పూజలతో గడుస్తుంది.
Also Read: కలియుగం అంతమై మళ్లీ సత్యయుగం ఎప్పుడు ప్రారంభమవుతుంది!
లింగోద్భవ సమయం
భోళాశంకరుడు లింగరూపంలో దర్శనం ఇచ్చిన సందర్భం మహా శివరాత్రి. దీని వెనుక ఉన్న కథ కూడా అందరకీ తెలుసు. బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు మధ్య తమలో ఎవరు గొప్ప అన్న వాదన మొదలైంది. ఈ సమస్యని తీర్చేందుకు వారిద్దరూ శివుని ఆశ్రయించగా ఆయన లింగరూపంలో దర్శనమిచ్చి.. వాటి ఆద్యంతాలు తెలుసుకోమని పరీక్ష పెట్టాడు. విష్ణువు దిగువు భాగాన్ని ...బ్రహ్మదేవుడు పై భాగాన్ని వెతుక్కుంటూ వెళ్లారు. ఆ సమయంలో బ్రహ్మకు కేతకి పుష్పం (మొగలిపువ్వు), గోవు దర్శనమిస్తాయి. మొగలి పువ్వు, గోవుకి తాను శివుడికి ఆది కనుగొన్నానని, దానికి సాక్ష్యం చెప్పాలని వాటికి చెప్పి వారితో శివుడి వద్ద సాక్ష్యం చెప్పిస్తాడు. శివుడు.. మహా విష్ణువు, బ్రహ్మ చెప్పిన విషయాన్ని గ్రహించి బ్రహ్మను, మొగలిపువ్వుని, గోమాతను శపిస్తాడు. బ్రహ్మదేవుడికి భూలోకంలో గుడి గానీ, పూజలు గానీ ఉండవని శపిస్తాడు. అలాగే, మొగలిపువ్వుకి పూజార్హత ఉండదని... గోవు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పడం వల్ల గోముఖం చూడటం పాపంగా, గోపృష్ట భాగాన్ని చూస్తే పాపపరిహారంగా శపిస్తాడు. శ్రీ మహావిష్ణువు సత్యం పలకడం వల్ల ఆయనకు విశ్వవ్యాపకత్వం అనుగ్రహిస్తాడు. బ్రహ్మద్వారా సృష్టించిన ప్రాణికోటిని రక్షించే భారం, మోక్షమును ఇచ్చే అధికారం, మహా విష్ణువుకు ఇవ్వడం ఇవన్నీ శివలింగోద్భవ సమయంలో జరిగాయని కూర్మ, వాయు, శివ పురాణాల్లో ఉంది.
Also Read: ఈ రాశులవారు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు, జనవరి 24 రాశిఫలాలు
త్రయోదశి నుంచి నియమాలు మొదలు
ఏకాదశి వ్రతం ఆచరించేవారు దశమి రోజు నుంచి నియమాలు పాటిస్తారు. అలాగే మహా శివరాత్రి నియమాలు కూడా త్రయోదశి నుంచి పాటించడం మొదలుపెట్టాలి. త్రయోదశి రోజు ఒకపూట భోజనం చేసి నేలపై నిద్రస్తారు. అనంతరం చతుర్థశి రోజు ఉదయాన్నే శివాలయాన్ని సందర్శించడం, ఉపవాసం, జాగరణతో ఉపవాసం పరిపూర్ణం అవుతుంది. జాగరణ అంటే శివుడిపై మనసు లగ్నం చేయడం..సినిమాలు చూడడం కాదు..
Also Read: గ్రహాల యువరాజు ఈ రాశులవారికి ఫిబ్రవరిలో రాజయోగాన్నిస్తాడు!
శివుడు అభిషేక ప్రియుడు
శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు అయినట్టే...పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. చెంబుడు నీళ్లు పోస్తే శివయ్య కరిగిపోతాడు. మరీ ముఖ్యంగా శివరాత్రి రోజు చేసే అభిషేకం మరింత పుణ్యఫలం. శివరాత్రి తొలి జాములో పాలతో అభిషేకించి పద్మాలతో పూజ చేయాలి, ఇక రెండో జాములో పెరుగుతో అభిషేకించి తులసిదళాలతో పూజ, మూడో జాములో నేయితో అభిషేకించి మారేడు దళాలతో పూజ, నాలుగో జాములో తేనెతో అభిషేకించి నీలకమలాలతో పూజ సాగించాలి. ఒక్కో జాములోనూ ఒక్కో ప్రసాదం సమర్పిస్తారు. శివరాత్రి రోజు శాస్త్రోక్తంగా పూజలు చేయడం సాధ్యం కాకపోయినా కనీసం లింగరూపంలో అభిషేకం చేసుకున్నా మంచిదే. శివ పంచాక్షరి స్తోత్రం, దారిద్ర్య దహన స్తోత్రం, నిర్వాణషట్కం, లింగాష్టకం, బిళ్వాష్టకం, విశ్వనాథాష్టకం పఠించినా శివుడి అనుగ్రహం లభిస్తుంది.
శివరాత్రి రోజున జాగరణ ఉండటం వల్ల రాత్రి పూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది. అలాగే, భగవంతుడి మీద సాధకులకు, మోక్షమార్గంలో ప్రయత్నించేవారికి ఇది విశేష సమయం. గృహస్థులకు ఆయురారోగ్యపరంగా పుణ్యార్చన పరంగా, శుభఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)