అన్వేషించండి

Horoscope Today 24th January 2024: ఈ రాశులవారు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు, జనవరి 24 రాశిఫలాలు

Horoscope Today 22nd January 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Today 24th January  2024  - జనవరి 24 రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope Today) 

ఆత్మవిశ్వాసంతో ఉంటారు. పాత మిత్రులను కలుస్తారు. అతిథుల రాకతో ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది. వృత్తి జీవితంలో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉంటూ కొత్త బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంటారు. ఉద్యోగంలో మీ ప్రమోషన్ అవకాశాలను పెంచుతుంది. వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వ్యాపారపరమైన లాభాలు ఉంటాయి.ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించండి.

వృషభ రాశి (Taurus  Horoscope Today)

కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్త ఆదాయ వనరులు క్రియేట్ అవుతాయి. అధిక ఖర్చుల కారణంగా మనస్సు ఆందోళన చెందుతుంది. విద్యా పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. స్నేహితుని సహాయంతో పనిలో ఆటంకాలు తొలగి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. సంబంధాలు మెరుగుపడతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

Also Read: గ్రహాల యువరాజు ఈ రాశులవారికి ఫిబ్రవరిలో రాజయోగాన్నిస్తాడు!

మిథున రాశి (Gemini Horoscope Today) 

వస్తు సంపద పెరుగుతుంది. వ్యాపారంలో విస్తరణ ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఇంట్లో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఉంటుంది. ఇంటి నిర్వహణకు డబ్బు ఖర్చు చేయవచ్చు. మీరు కార్యాలయంలోని పై అధికారుల నుంచి మద్దతు పొందుతారు. ఉద్యోగస్తులకు ఈరోజు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విద్యా పనిలో మంచి ఫలితాలను పొందుతారు.ఆర్థిక పరిస్థితి బావుంటుంది.

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పనిలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించే ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కృషి, అంకితభావం  మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో మార్పు వచ్చే సూచనలున్నాయి. మీ భావోద్వేగాలను నియంత్రించండి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వృత్తి జీవితంలో చిన్న సమస్యలు ఉంటాయి. మీ ప్రియమైనవారి నుంచి మద్దతు పొందుతారు. 

సింహ రాశి (Leo Horoscope Today)

కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం బాగానే ఉంటుంది. పూర్వీకుల  ఆస్తికి సంబంధించిన వివాదాలు ఓ కొలిక్కివస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఏదో తెలియని భయం వల్ల మనస్సు కలత చెందుతుంది. ఆశ, నిరాశ ఉంటుంది. సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబంతో సమయాన్ని వెచ్చిస్తారు. 

Also Read: కలియుగం అంతమై మళ్లీ సత్యయుగం ఎప్పుడు ప్రారంభమవుతుంది!

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

ఈ రోజు మీకు చాలా శుభప్రదమైనది. శత్రువులపై విజయం ఉంటుంది. పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు వృత్తిపరమైన విజయాన్ని పొందుతారు. విద్యా పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. మీరు పనులను పూర్తి చేయడానికి కార్యాలయంలో ఎక్కువ సమయం గడపవలసి రావచ్చు. మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. రోజూ వ్యాయామం లేదా యోగా చేయండి.  

తులా రాశి (Libra Horoscope Today) 

మాటల్లో సౌమ్యత ఉంటుంది. కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు పాత స్నేహితులను కలుస్తారు. ఉద్యోగంలో స్థలం మారే అవకాశాలున్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఈ రోజు మానసికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. జీవితం బాధాకరంగా ఉంటుంది. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. సహనం పాటించండి.  

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

సామాజికంగా పదవులు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో పురోగతికి కొత్త అవకాశాలు ఉంటాయి. కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాల ద్వారా ధనలాభం ఉంటుంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ రోజు రచన , మేధోపరమైన పని ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. 

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

మీరు ప్రారంభించే పనులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. పోటీపరీక్షలు రాసే విద్యార్థులు ఆహ్లాదకరమైన ఫలితాలు పొందుతారు.  మీరు కార్యాలయంలో పై అధికారుల నుంచి మద్దతు పొందుతారు. ఉద్యోగంలో పురోగతికి బంగారు అవకాశాలు ఉంటాయి. బాధలో ఉండగా ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. 

మకర రాశి (Capricorn Horoscope Today) 

ఈ రాశి ఉద్యోగుల సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. శృంగార జీవితం బాగుంటుంది.  ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోండి. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు వెతుక్కోవడం మంచిది. పనిలో కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కెరీర్‌లో అపారమైన విజయాన్ని పొందుతారు.

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

ఈ రోజు మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ మనసు చెప్పింది వినండి. కొన్ని సందర్భాల్లో రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. కెరీర్ కి సంబంధించి అడుగు ముందుకు వేస్తారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అనేక ఆదాయ వనరుల నుంచి ఆర్థిక లాభాలు ఉంటాయి

మీన రాశి (Pisces Horoscope Today) 

ఈ రోజు మీరు మీ కష్టానికి , అంకితభావానికి తగిన ఫలాలను పొందుతారు. కొత్త ప్రాజెక్టులలో పని చేసే అవకాశాలు లభిస్తాయి.  మీ కృషిని , నిబద్ధతను మీ ఉన్నతాధికారులు అభినందిస్తారు. జీవితంలో చాలా ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి. మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. మీ ఖర్చులపై నియంత్రణ ఉంచండి. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి.

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
HCA : ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
YS Sharmila: భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs KKR Match Preview IPL 2025 | KKR తో మ్యాచ్ నుంచి CSK కెప్టెన్ గా ధోని | ABP DesamRCB Home Ground Sad Story IPL 2025 | సొంత మైదానంలోనే ఆర్సీబీకి షాకులుKL Rahul 93* vs RCB IPL 2025 | కేఎల్ రాహుల్ మాస్ ఇన్నింగ్స్ కు అసలు రీజన్ ఇదేKL Rahul Strong Statement | RCB vs DC మ్యాచ్ లో వీర విజృంభణ తర్వాత కేఎల్ రాహుల్ మాస్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
HCA : ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
YS Sharmila: భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
TG TET Schdule: తెలంగాణ టెట్-2025 పరీక్షల షెడ్యూల్ విడుద‌ల‌, వివరాలు ఇలా
తెలంగాణ టెట్-2025 పరీక్షల షెడ్యూల్ విడుద‌ల‌, వివరాలు ఇలా
Vijayawada Metro Latest News: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో కీలక ముందడుగు
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో కీలక ముందడుగు
TTD News: సమ్మర్‌లో శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా ? - ఇదిగో ప్రత్యేక రైళ్ల జాబితా - టిక్కెట్లు బుక్ చేస్కోండి
సమ్మర్‌లో శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా ? - ఇదిగో ప్రత్యేక రైళ్ల జాబితా - టిక్కెట్లు బుక్ చేస్కోండి
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
Embed widget