(Source: ECI/ABP News/ABP Majha)
Paush Purnima 2024: జనవరి 25 పుష్యమాస పౌర్ణమి - ఈ రోజు విశిష్టత ఏంటి, ఏం చేయాలి!
Paush Purnima 2024 : పౌర్ణమి తిథిని అత్యంత పవిత్రమైన తిథిగా భావిస్తారు. ఏడాదిలో వచ్చే 12 పౌర్ణమిలలో కొన్ని పౌర్ణమిలు అత్యంత ముఖ్యమైనవి. వాటిలో ఒకటి పుష్యమాస పౌర్ణమి. ఈ రోజు విశిష్టత ఏంటి? ఏం చేయాలి?
Paush Purnima 2024 Date : జనవరి 25 గురువారం పుష్యమాస పౌర్ణమి
పుష్యమాస పౌర్ణమి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనువైనదిగా చెబుతారు. ఈ రోజు నదీస్నానం, లక్ష్మీ పూజ, దాన ధర్మాలు చేస్తే.. గతజన్మలో పాపాలు, ఈ జన్మలో ఇప్పటివరకూ చేసిన పాపాలు తొలగిపోయి..మోక్షానికి మార్గం సుగమం అవుతుందని భక్తుల విశ్వాసం. కొన్ని ప్రదేశాలలో, పుష్య పౌర్ణమిని ‘శాకంబరి జయంతి’గా కూడా జరుపుకుంటారు. ఈ రోజు దుర్గాదేవిని శాకంబరీ దేవిగా అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. భూమిపై కరువు, తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని తగ్గించడానికి దుర్గా దేవి శాకంబరిగా అవతరించిందని నమ్ముతారు. అందుకే కూరగాయలు, పండ్లు, హరిత వర్ణ ఆకులతో అమ్మవారిని అలంకరించి పూజిస్తారు. ఇధి అష్టమిరోజు ప్రారంభమై పౌర్ణమితో ముగుస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లోని గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు అమ్మవారిని ఆకులతో అలంకరిస్తారు. దీనిని అక్కడి గిరిజనులు 'చార్తా పండుగ'(పంటల పండుగ) అంటారు.
Also Read: కలియుగం అంతమై మళ్లీ సత్యయుగం ఎప్పుడు ప్రారంభమవుతుంది!
పుష్య పౌర్ణమి విశిష్టత
ప్రతి మనిషికి విశ్వంతో విడదీయరాని అనుబంధం ఉంటుంది. భూమ్మీద ఉన్నంతకాలం పాపం, పుణ్యం రెండూ చేస్తారు. ఏం చేసినా ఆ భారాన్ని మరణానంతరం మోసుకెళ్లాల్సిందే. అయితే పుష్యమాస పౌర్ణమి రోజు నదీస్నానం ఆచరించి శ్రీ మహాలక్ష్మిని, శ్రీ మహావిష్ణువిని ఆరాధించడం ద్వారా పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతారు.
Also Read: ఈ రాశులవారు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు, జనవరి 24 రాశిఫలాలు
లక్ష్మీదేవిని కలువపూలతో పూజించండి
పుష్య పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని కలువ పూలతో పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఆ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతారు.
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
Also Read: గ్రహాల యువరాజు ఈ రాశులవారికి ఫిబ్రవరిలో రాజయోగాన్నిస్తాడు!
సూర్యుడి కిరణాల వేడి పెరిగే సమయం
వేద జ్యోతిషశాస్త్రం మరియు హిందూ విశ్వాసాల ప్రకారం పుష్యమాసం పౌర్ణమి నుంచి సూర్య భగవానుడి వేడి పెరుగుతూ వస్తుంది. మాఘ మాసం ప్రారంభమైనప్పటి నుంచీ ఆ వేడి మరింత పెరుగుతుంది. అందుకే ఈ పౌర్ణణి రోజు నదీస్నానం ఆచరించి సూర్య, చంద్రులను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. ఈ రోజు దానధర్మాలు చేస్తారు, మోక్షాన్ని పొందేందుకు ఉపవాసం ఉంటారు. ఈ రోజు చేసే దాన ధర్మాలు వేటికైనా అపారమైన ఫలితాలుంటాయి.
పుష్య పౌర్ణమి నాడు శుభ కార్యాలు
పుష్య పౌర్ణమి రోజు దేశవ్యాప్తంగా వివిధ తీర్థయాత్రలు , పవిత్ర నగరాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువును ఆరాధించేవారు కొందరు, పరమేశ్వరుడిని దర్శించుకునేవారు మరికొందరు...సత్యనారాయణ వ్రతాలు ఆచరించేవారు ఇంకొందరు. ఈ రోజు భగవద్గీత , రామాయణం చదవడం కూడా కొందరు పాటిస్తారు. ఈ పుష్య పౌర్ణమి రోజు శ్రీకృష్ణుని ఆలయాలలో విలక్షణమైన ‘పుష్యాభిషేక యాత్ర’ ప్రారంభమవుతుంది.
Also Read: భార్య భర్త కాళ్ళు ఎందుకు పట్టాలి- శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర లక్ష్మీదేవి ఎందుకు కూర్చుంటుంది!