By: RAMA | Updated at : 16 Dec 2022 12:03 PM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Pinterest
Sri Maha vishnu lakshmi: ఆధునిక యుగం, హడావుడి జీవితం..అందరూ యాంత్రికంగా మారిపోయారు. కాసుల వేటలో పడి కుటుంబవిలువలు, పద్ధతులు కొందరు పూర్తిగా మర్చిపోయినా ఇప్పటికీ వాటిని పాటించేవారు అక్కడక్కడా ఉన్నారు. వాటిలో ఒకటి భర్త కాళ్లు ఒత్తడం. ఇది ఆధిపత్యానికి నిదర్శనం అని అనుకుంటే పొరపాటే.....పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై శయనించి ఉంటే స్వామివారి పాదాల దగ్గర కూర్చుని ఉంటుంది లక్ష్మీదేవి. శేషతల్పంపై స్వామివారి ప్రతి ఫొటోలోనూ అమ్మవారు అయ్యవారి పాదాల దగ్గరే కూర్చుని కనిపిస్తుంది. సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర ఎందుకు కూర్చుంటుంది... ఇంట్లో ఆనందానికి, ఐశ్వర్యానికి సంబంధించి నిగూఢ అర్థం ఉందని చెబుతారు పండితులు
మహాలక్ష్మైచ విద్మహే
విష్ణుపత్న్యైచ ధీమహి
తన్నోలక్ష్మీ ప్రచోదయాత్
Also Read: తిరుప్పావై అంటే ఏంటి, 30 రోజులు పాడే పాశురాల ప్రత్యేకత ఏంటి!
హిందూ మతంలో లక్ష్మి దేవిని సంపదకు అధిదేవతగా భావిస్తారు. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉన్న వారికి ఆర్థిక సమస్యలు ఉండవు. అన్నింటా విజయం సిద్ధిస్తుంది. ఇక శ్రీ మహావిష్ణువు గురించి చెప్పుకోవాలంటే విశ్వమంతా ఉండేవాడే విష్ణువు. "విష్" అంటే సర్వత్ర వ్యాపించి ఉండుట, అంతటినీ ఆవరించి ఉండుట అనే అర్థాలున్నాయి. విష్ణు సహస్రనామ స్తోత్రం మొదటి శ్లోకంలో "విశ్వం, విష్ణుః, వషట్కారః, భూత భవ్య భవత్ప్రభుః, భూతకృత్, భూతభృత్, భావః, భూతాత్మా, భూత భావనః" అనే నామాలున్నాయి. "యద్ విషితో భవతి తద్ విష్ణుర్భవతి" - అంతటా ప్రవేశించి ఉండేవాడు విష్ణువు. అంటే విశ్వానికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు కాళ్ల దగ్గర సంపద అధిదేవతగా భావించే లక్ష్మీదేవి ఉంటుంది.
ఓసారి నారదుడు...శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వైకుంఠానికి వెళ్లినప్పుడు...స్వామివారు నిద్రలో ఉన్నారని చూసి అక్కడే వేచి ఉండడం సముచితంగా భావిస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి భర్త పాదాల దగ్గర కూర్చుని ఉండటాన్ని చూసి..ఆయన మనసులో ప్రశ్న ఉదయించింది. అమ్మ ఎప్పుడూ శ్రీహరి పాదాల దగ్గర ఎందుకు కూర్చుంటుందని..తనలో తాను ఆగలేక ఈ ప్రశ్న లక్ష్మీదేవిని అడిగాడు.
Also Read: డిసెంబరు 16 నుంచి ధనుర్మాసం ప్రారంభం, ఈ నెలరోజుల బ్రహ్మ ముహూర్తం చాలా ప్రత్యేకం!
"పురుషులకు కాళ్ళ వేలినుంచి మోకాళ్ళ వరకు ఉన్న భాగం శనిది .. స్త్రీల వేళ్ళ కొనలనుంచి అరచేయి వరకు ఉన్న భాగం శుక్రుడిది. భార్య..భర్త కాళ్లు పట్టడం ద్వారా శనిపై శుక్రుడి ప్రభావం పడి శని ప్రభావం తగ్గుతుంది. ఆ ఇల్లు సకల సంపదలకు నిలయగా మారుతుంది. అన్యోన్య దాంపత్యం,ప్రశాంతత లభిస్తుందని చెబుతారు. భార్య తన భర్త పాదాలను నొక్కినప్పుడు గ్రహాల చెడు ప్రభావాలను నివారించడంతో పాటు, సంపద కూడా సిద్ధిస్తుంది.
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023 కన్యాారాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Milk: పాలు తాగిన వెంటనే ఇంటి నుంచి బయటకు వెళితే అరిష్టమా? సైన్సు ఏం చెబుతోంది?
మార్చి 27 రాశిఫలాలు, ఈ రాశివారు తమని తాము నిరూపించుకునేందుకు ఇదే మంచి సమయం
Valmidi Srirama Navami : వల్మీడిలో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు, ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రి ఎర్రబెల్లి
Buddha Statue Vastu: ఇంట్లో బుద్ద విగ్రహం పెట్టుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
శ్రీవారికి మూడు నామాలే ఎందుకు అలంకరిస్తారు ?
Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!