News
News
X

2023 New Year Horoscope: 2023లో ఆరంభంలో ఈ రాశివారు మానసికంగా బాధపడతారు, ఆర్థికపరిస్థితి మాత్రం ఆశాజనకం

Horoscope 2023: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
 
Taurus Horoscope 2023: 2022 ఏడాది చివరికి వచ్చేశాం..2023 లోకి అడుగుపెట్టేయబోతున్నాం. గడిచిన సంవత్సరంలో మంచిని గుర్తుచేసుకుంటూ చెడును వదిలేస్తూ ముందుకు అడుగేయాలి. మరి కొత్త ఏడాది వృషభ రాశివారికి ఎలా ఉందో చూద్దాం...

2023లో మేషరాశి ఫలితాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి...

2023 లో వృషభ రాశివారికి విజయావకాశాలు పెరుగుతాయి. ఈ ఏడాది మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతాయి. జనవరి 17న శని మకరరాశిని విడిచిపెట్టి సొంత రాశి అయిన కుంభంలోకి ప్రవేశిస్తుంది. ఏప్రిల్ 22న బృహస్పతి తన  సొంత రాశి మీనంను విడిచిపెట్టి..మేషంలోకి ప్రవేశిస్తుంది. రాహువు, కేతువు ఏడాది త్రైమాసికంలో వరుసగా మీనం, కన్యారాశిలో సంచరించి అక్టోబరు 30న పదకొండో స్థానానికి చేరుతుంది.ఈ గ్రహాలన్నీ ఈ ఏడాది మీకు అనుకూల ఫలితాలనే అందిస్తున్నాయి.

2023 లో వృషభ రాశి ఫలాలు 

News Reels

 • వృషభ రాశిలో జన్మించిన వారి జీవితాల్లో ఈ సంవత్సరం గుర్తించదగిన మార్పులుంటాయి..అన్ని రంగాలవారికి విజయాన్నిస్తుంది
 • సంవత్సరం ప్రారంభంలో మీరు కొంత మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇది నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పై ప్రభావం చూపిస్తుంది.
 • 2023 ప్రారంభంలో మీ రహస్యాలు కొన్ని బహిర్గతం కావచ్చు..ఇది మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది..మానసిక ఒత్తిడిని పెంచుతుంది..ఒత్తిడి తీవ్రస్థాయికి చేరితే అనారోగ్యం పాలవుతారు.
 • కష్టపడి పనిచేస్తారు..కష్టానికి తగిన ఫలితం పొందుతారు..తద్వారా ఆర్థిక విజయం సాధ్యమవుతుంది
 • పదో స్థానంలో సంచరిస్తున్న శని కారణంగా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది..అయితే ఈ కృషి మీకు మంచి గుర్తింపునిస్తుంది. భవిష్యత్ కి ఉపయోగపడుతుంది
 • ఈ ఏడాది విహారయాత్రలు చేస్తారు, పవిత్ర నదుల్లో స్నానమాచరిస్తారు
 • ఏడాదిలో మొదటి నాలుగు నెలలు ఆర్థిక పరిస్థితి బావుంటుంది...రెండో నాలుగు నెలలు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి.. చివరి నాలుగు నెలలు పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది
 • ఈ ఏడాది వ్యాపారులు, విద్యార్థులకు మంచి ఫలితాలుంటాయి. వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి
 • కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి..మానసికంగా దృఢంగా ఉంటారు..కొత్త సంబంధాలు అభివృద్ధి చెందుతాయి
 • కొత్త ప్రణాళికలు వేసుకునేందుకు ఇదే మంచిసమయం..అనుకున్న ఫలితాలు అందుకుంటారు
 • ఆరోగ్యంలో కొంత హెచ్చుతగ్గులు ఉంటాయి..మొరటుగా ప్రవర్తించడం మానుకోండి
 • ఏప్రిల్ మీ జీవితంలో ఆనందం, ప్రేమ ఉంటాయి
 • జూన్ నుంచి నవంబరు మధ్య విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది
 • జూలై నుంచి సెప్టెంబరు వరకు మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ చాలా వహించాలి. పనిలో మీకు ఆత్మవిశ్వాసం లేకపోవడం కూడా ఒక అవరోధంగా ఉండవచ్చు.
 • అక్టోబర్‌లో చాలా మార్పులు వస్తాయి..మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది...డిసెంబరు వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది
 • అదనంగా ఆస్తి కొనుగోలుకు ప్రత్యేక అవకాశాలు ఉంటాయి.

Also Read: నవంబరు 24 నుంచి మార్గశిరమాసం ప్రారంభం, ఆధ్యాత్మికంగా ఈ నెల చాలా ప్రత్యేకం

Also Read: దేవుడు తినడు కదా మరి నైవేద్యం ఎందుకు పెట్టాలి!

Published at : 19 Nov 2022 12:15 PM (IST) Tags: daily horoscope horoscope 2023 leo horoscope 2023 pisces horoscope 2023 gemini 2023 horoscope cancer 2023 horoscope 2023 horoscope predictions leo horoscope aries horoscope 2023 virgo horoscope 2023 libra horoscope 2023 leo 2023 horoscope taurus horoscope 2023 gemini horoscope 2023 cancer horoscope 2023 yearly horoscope 2023

సంబంధిత కథనాలు

Baba Vanga: భయం గొలుపుతున్న బాబా వంగా ప్రిడిక్షన్స్ - 2023లో ఇన్ని అనర్థాలా?

Baba Vanga: భయం గొలుపుతున్న బాబా వంగా ప్రిడిక్షన్స్ - 2023లో ఇన్ని అనర్థాలా?

Horoscope Today 5th December 2022: ఈ రాశివారికి 'మూడ్ స్వింగ్స్''ఉంటాయి, డిసెంబరు 5 రాశిఫలాలు

Horoscope Today 5th December 2022: ఈ రాశివారికి 'మూడ్ స్వింగ్స్''ఉంటాయి, డిసెంబరు 5 రాశిఫలాలు

Geetha Jayanthi2022: పరిపూర్ణమైన ఆనందం ఎక్కడ లభిస్తుంది, గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు!

Geetha Jayanthi2022: పరిపూర్ణమైన ఆనందం ఎక్కడ లభిస్తుంది, గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు!

Geetha Jayanthi2022: ఇవి తెలుసుకుంటే భగవద్గీత చదివినట్టే

Geetha Jayanthi2022: ఇవి తెలుసుకుంటే భగవద్గీత చదివినట్టే

Geetha Jayanthi2022: ఈ రోజు గీతా జయంతి - భగవద్గీత మత గ్రంధం కాదు మనిషిగా ఎలా బతకాలో చెప్పే మార్గదర్శి

Geetha Jayanthi2022: ఈ రోజు గీతా జయంతి - భగవద్గీత మత గ్రంధం కాదు మనిషిగా ఎలా బతకాలో చెప్పే మార్గదర్శి

టాప్ స్టోరీస్

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

10 రోజులు టైమ్ ఇస్తున్నా, దమ్ముంటే అవినీతి నిరూపించు: బండి సంజయ్‌కి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్

10 రోజులు టైమ్ ఇస్తున్నా, దమ్ముంటే అవినీతి నిరూపించు: బండి సంజయ్‌కి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!