చాణక్య నీతి: సముద్రం, పర్వతం మనిషికి ఉత్తమ గురువులు



చాణక్యుడు తన నీతిశాస్త్రంలో కేవలం రాజనీతి గురించి మాత్రమే కాదు...జీవితానికి సంబంధించిన విషయాల గురించి వివరంగా బోధించాడు



జీవితంలో విజయం సాధించాలంటే కేవలం గురువు దగ్గర నేర్చుకున్న పాఠాలే కాదు ప్రకృతి నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో



పర్వతాలు, సముద్రాలు ఒక వ్యక్తికి విజయాన్ని ఎలా బోధిస్తాయో తెలియజేశాడు చాణక్యుడు



ప్రళయా భవాన్మర్యాదా భవన్తీ చంపే సాగరః ।
సాగ్ర భేద్మిచ్ఛన్తి ప్రయల్పి నహి సాధవ్ ॥
మనిషిని... ప్రశాంతంగా ఉండే సముద్రంతో పోల్చాడు చాణక్యుడు.



ఆహ్లాదంగా కనిపించే సముద్రం విపత్తు సమయంలో తనేంటో మరిచిపోయి ఒడ్డును నాశనం చేస్తుంది. మనిషి మనసు కూడా ఇంతే. సంక్షోభ సమయంలో తన ఉన్నత వ్యక్తిత్వాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తాడు. తన పరిమితులు మరిచిపోతాడు.



ఎలాంటి సందర్భం ఏదురైనా తన విచక్షణ కోల్పోకుండా ప్రవర్తించాలి, సంక్షోభ సమయాల్లో కూడా తన పరిమితులను ఎప్పుడూ ఉల్లంఘించకూడదు. అలాంటి వ్యక్తిని సముద్రం కంటే గొప్ప అంటారు.



శైలే శైలే న మాణిక్యం మౌక్తికం న గజే గజే ।
సాధ్వో చందనం లేదా వనే వనే ప్రతిచోటా లేదు.
పర్వతంపై రత్నాలు, కెంపులు, బంగారం, వెండి, ఖనిజాలు కనిపించవని చాణక్యుడు చెప్పిన ఈ శ్లోకం అర్థం



ప్రతి ఏనుగు తలపై ముక్తామణి ఉండనట్లే మనిషిలో ఋషి బయటకు కనిపించడు..కానీ సహజంగా ఉండాల్సిన లక్షణాలను కోల్పోకుండా ఉన్న వ్యక్తే ఉత్తముడు



ప్రతి అడవిలోనూ చందనం చెట్లు కనిపించనట్టే ప్రతి వ్యక్తి సంపాదనా ఒకేలా ఉండదు. ఉన్నదానితో సంతృప్తి చెందాలి, పరిమితికి మించి పరిగెత్తితే ఎప్పటికీ విజయం సాధించలేడు..ఆలోచనలు అదుపులో ఉంచుకోలేడు


Thanks for Reading. UP NEXT

చాణక్య నీతి: జీవిత భాగస్వామిని ఇలా ఎంపికచేసుకోండి లేదంటే పశ్చాత్తాప పడతారు

View next story