చాణక్య నీతి: జీవిత భాగస్వామిని ఇలా ఎంపికచేసుకోండి లేదంటే పశ్చాత్తాప పడతారు
నాలుగో శతాబ్దం-మూడో శతాబ్ధం మధ్యకాలంలో జీవించిన గొప్ప మేధావి, రాజనీతిజ్ఞుడు ఆచార్య చాణక్యుడు.
తన అపారమైన రాజనీతిజ్ఞతతో వందలఏళ్లు నిరంతరాయంగా పాలించిన నందవంశాన్ని సమూలంగా నాశనం చేసి మగధ సింహాసనంపై చంద్రగుప్త మౌర్యుడిని కూర్చోబెట్టగలిగిన అపారమైన మేధావి
ఈ నీతిశాస్త్రంలో కేవలం రాజనీతి గురించి మాత్రమే కాదు...జీవితానికి సంబంధించిన విషయాల గురించి వివరంగా బోధించాడు
వ్యక్తి జీవితం, స్నేహం, కర్తవ్యం, స్వభావం, భార్య, పిల్లలు, సంపద, వ్యాపారం ఇలా జీవితంలో ముఖ్యమైన భాగాల గురించి ప్రస్తావించాడు...అదే సమయంలో జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు తనలోని కొన్ని లక్షణాలను పరీక్షించమని చెప్పాడు
మతపరమైన ధోరణులు ఏ వ్యక్తినైనా ఒక పరిమితికి కట్టుబడి ఉంటారు. ముఖ్యంగా వారు అనుసరించే మతంపై ఆసక్తి-అనాశక్తి తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఓ పద్ధతిని పద్ధతిగా ఫాలో అయ్యేవ్యక్తి మీ జీవితంలో సంతోషాన్ని నింపడమే కాదు కుటుంబాన్ని చక్కగా తీర్దిదిద్దగలుగుతారు
సహనం జీవితంలో చాలా సందర్భాల్లో పరిస్థితులను ఎదుర్కోవాలన్నా, సమస్యలను పరిష్కరించుకోవాలన్నా సహనం అవసరం. ఈ లక్షణం మీజీవిత భాగస్వామిలో ఉంటే ఎంత కష్టాన్నైనా ఎదుర్కోగలుగుతారు.
చాణక్య విధానం ప్రకారం ఒక రోగికూడా మీకు కష్టకాలంలో కూడా సరైన మార్గాన్ని చూపిస్తాడు..తన కారణంగా కొన్ని సవాళ్లను పరిష్కరించగలుగుతారు
బాహ్య ఆకృతి కొన్నాళ్లే ఒక వ్యక్తి తన అందం లేదా బాహ్య ఆకృతిని చూసి నిర్ణయం తీసుకోవద్దు. శారీరక ఆకర్షణ కొంతసేపే...కొన్నేళ్లు మాత్రమే. కానీ అంతర్గత అందం మీతో జీవితాంతం ఉంటుంది. అలాంటి భాగస్వామిని ఎంపిక చేసుకోగలిగితే మీ జీవితం ధన్యం
నిర్ణయం మీదే మీకంటే మిమ్మల్ని మెరుగ్గా మరెవరూ అర్థం చేసుకోలేరు..ఎలాంటి జీవిత భాగస్వామి మీకు కరెక్టో చెప్పలేరు. ఎందుకంటే మీ సంతోషాన్ని అందరూ పంచుకుంటారు కానీ విపత్కర పరిస్థితుల్లో భుజం కలపి మద్దతిచ్చేది మీ భాగస్వామి మాత్రమే.
అందుకే ఒకరి ఒత్తిడితో ఎప్పుడూ నిర్ణయం తీసుకోవద్దు. అది భవిష్యత్ లో మీ ఇద్దరి జీవితాలపై చాలా ప్రభావం చూపిస్తుంది.