కార్తీకమాసంలో దీపారాధనకు మిక్కిలి ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో ఏ దిక్కులో ఉంచైనా దీపాన్ని పెట్టొచ్చు. దీపారాధనకు ఉపయోగించే నూనెను బట్టి ఒక్కొక్కరకమైన ఫలితం ఉంటుంది. దీపారాధనకు ఆవునెయ్యి ఉపయోగిస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. నువ్వులనూనెతో దీపారాధన వల్ల శనిగ్రహ దోషాలు తొలిగిపోతాయి. దీనివల్ల మనకు ఉన్న కష్టాలన్నీ తొలిగిపోతాయి. కీర్తిప్రతిష్టతలు కావాలంటే ఆముదం నూనెతో దీపారాధన చేయడం మంచిది కొబ్బరినూనెతో దీపారాధనను చేస్తే ఇంట్లో శాంతి నెలకొంటుంది పంచదీప నూనెతో దీపారాధన చేస్తే అనారోగ్య బాధలు దూరమవుతాయి. నువ్వుల నూనె, కొబ్బరి నూనె , ఆముదం నూనె, ఇప్పనూనె, ఆవునెయ్యి వీటిని కలిపితే పంచదీపనూనె అవుతుంది. ఈ నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో దుష్టశక్తులు ఉంటే తొలిగిపోతాయి.