పుట్ట దగ్గర నాగేంద్రుడి ప్రార్థన ఇలా చేయండి



నన్నేలు నాగన్న , నాకులమునేలు
నాకన్నవారల నాఇంటివారనేలు



ఆప్తమిత్రులనందరిని ఏలు
పడగ తొక్కిన పగవాడనుకోకు



నడుము తొక్కిన నావాడనుకో
తోక తొక్కితే తొలిగిపో వెళ్లిపో



ఇదిగో ! నూకల్ని పుచ్చుకో మూకల్ని ( పిల్లల్ని) ఇవ్వు
అని పుట్టలో పాలు పోస్తూ నూక వేసి వేడుకుంటారు



పుట్టలోని నాగేంద్రస్వామి లేచి రావయ్యా!
గుమ్మపాలు త్రాగి వెళ్ళిపోవయ్యా!



చలిమిడి వడపప్పు తెచ్చినామయ్యా!
వెయ్యి దండాలయ్య, నీకు కోటి దండాలయ్యా!



మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు.



కుండలినీశక్తి మూలాధారచక్రంలో పాము ఆకారంలా ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్టు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కతూ మనిషిలో సత్వగుణాన్ని హరించివేస్తుంది.



నాగుల చవితిరోజు ప్రత్యక్షంగా విషసర్పాలున్న పుట్టలను ఆరాధించి పాలుపోస్తే మనిషిలో ఉన్న విషసర్పం శ్వేతత్వం పొందుతుందని పండితులు చెబుతారు.



నోట్: ఇవి పండితులు నుంచి సేకరించిన వివరాల ఆధారంగా రాసినది, దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం..
(Image Credit: Pinterest)