చాణక్య నీతి: భార్యభర్త గుర్తుపెట్టుకోవాల్సిన 3 విషయాలు



ఆచార్య చాణక్య తన విధానాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు



గొప్ప వ్యూహకర్త, ఆర్థికవేత్త అయిన చాణక్యుడు తన విధానాల బలంతో నంద వంశాన్ని సమూలంగా నాశనం చేసి..చంద్రగుప్త మౌర్యుడికి పట్టం కట్టాడు



తన నీతిశాస్త్రంలో భార్యాభర్తల మధ్య సంబంధం గురించి ప్రస్తావించిన చాణక్యుడు... వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే ఈ 3 విషయాలు చాలా ముఖ్యమైనవని చెప్పాడు.



1.ప్రశాంతమైన మనస్సు
భార్య భర్తల బంధంలో సమస్య రాగానే ముందుగా భూతద్దంలో పెట్టి చూడడం మానేయాలి. పరిష్కారం లేని సమస్య ఉండదు కదా అనే విషయం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్నప్పుడే మంచి-చెడు మధ్య తేడా గుర్తించడం సులభం అవుతుంది



ఆవేశం, ఆగ్రహంలో ఉన్న వ్యక్తి తనకు తాను హానిచేసుకోవడమే కాకుండా జీవిత భాగస్వామికి కూడా హాని చేయడానికి వెనుకాడడు. అందుకే సంతోషకరమైన వైవాహిక జీవితానికి మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం.



2.సమానత్వం
వైవాహిక జీవితంలో ఒక వ్యక్తి జీవిత భాగస్వామికి గౌరవం ఇవ్వాల్సిన దగ్గర ఇవ్వాలి. అలాంటి బంధం ఎప్పటికీ విచ్ఛిన్నం కాదు. బంధాల మధ్య అహంకారానికి చోటివ్వనంతవరకూ పటిష్టంగానే ఉంటాయి..



3.సంతృప్తి
వ్యక్తిగత సంతోషానికి అయినా, ఇంట్లో సంతోషం వెల్లివిరియాలన్నా సంతృప్తి మొదటి మొట్టు. అన్ని విషయాల్లో సంతృప్తి కలిగి ఉండడం చాలా ముఖ్యం.



సంతోషకరమైన వైవాహిక జీవితానికి సంతృప్తి చాలా చాలా ముఖ్యం. ఒకరి అవసరాలు మరొకరు చెప్పుకోవాలి, తీచ్చుకోవాలి.. ఉన్నంతలో సంతృప్తిగా ఉండే మార్గాలు వెతుక్కోవాలి.



అనవసరమైన ఖర్చులు, స్థాయికి మించిన డిమాండ్లు సంబంధాల మధ్య విభేదాలను సృష్టిస్తాయి...అందుకే ఆదాయాన్ని, సమయాన్ని బట్టి మిమ్మల్ని మీరు సర్దుబాటు చేసుకోవడం చాలా ముఖ్యం.



ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం..ఎవరి వైవాహిక జీవితంలో అయినా ఈ మూడు విషయాలను గుర్తుచేసుకుంటే భార్యభర్తల మధ్య సంఖ్యత పెరుగుతుంది, అనుబంధం బలపడుతుంది