ఈ నాలుగు మీదగ్గరుంటే ప్రపంచంలో మీరే మొదటి అదృష్టవంతులు



నందవంశాన్ని భూ స్థాపితం చేసి మౌర్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతి సూక్తులు తరతరాలకు ఉపయోగపడాతాయి



రాజకీయాలు, ఆర్థిక సంబంధిత విషయాలు, నీతి, న్యాయంతో పాటూ..వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా చాలా విషయాలు బోధించాడు చాణక్యుడు



ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం ఈ 4 అంశాలు ఎవరిదగ్గరుంటాయో వారు అదృష్టవంతులు. అవేంటో చూద్దాం



1.మంచి లక్షణాలున్న జీవిత భాగస్వామి
అనుకూలవతి అయిన, సద్గుణాలు కలిగిన జీవిత భాగస్వామి దొరకడం కన్నా అదృష్టం ఏముంటుంది.



కష్టం-నష్టం-సుఖం- సంతోషంలో తోడుగా ఉంటే అంతకన్నా కావాల్సింది ఏముంది. ధర్మబద్ధమైన, సద్గుణాలు కలిగిన జీవితభాగస్వామి కలిగిన వారికన్నా అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరంటాడు చాణక్యుడు



2.ఎక్కడ ఖర్చు చేయాలో తెలియాలి
దీన్నే డబ్బును సక్రమంగా వినియోగించడం అంటారు. ఎంత సంపాదించాం అన్నది కాదు అవసరమైనంత మేరకే ఖర్చుపెట్టామా లేదా అన్నది చూసుకోవాలి. ఇలా చేస్తే ఆటోమేటిగ్గా ధనం కూడబెడుతున్నట్టే..లక్ష్మీదేవి మీ దగ్గరున్నట్టే.



3.దానం-ధర్మం
ఓ చేత్తో దానం చేసిన విషయం మరో చెతికి కూడా తెలియకూడదంటాడు చాణక్యుడు. చేయాలనుకున్న మంచి పని చేయడంలోనే తృప్తి ఉందని చెప్పే చాణక్యుడు..దానధర్మాలు సంఘంలో గొప్పగా నిలబెట్టడమే కాదు.. సంపదను పెంచుతాయంటాడు.



4.జీర్ణం చేసుకునే సామర్థ్యం
ఎంత సంపాదిస్తే ఏం లాభం....కడుపునిండా తినే సామర్థ్యం లేనప్పుడు అంతా వ్యర్థమే. అలాగని తినడం కోసమే పుట్టామా అంటే కాదుకానీ...తిన్న ఆహారం జీర్ణం చేసుకునే శక్తి కలిగిఉండడం కన్నా అదృష్టం ఏముంటుంది. అలా కాకుంటే రోగాలకు ఆహ్వానం పలుకుతున్నట్టే కదా...



చాణక్యుడు చెప్పినట్టు ఈ నాలుగు అంశాలు ఎవరి సొంతమో వారికన్నా అదృష్ట వంతులు ఈ భూ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు