అక్టోబరు 28 శుక్రవారం తదియ మధ్యాహ్నం 12.24 వరకూ ఉంది..తదుపరి చవితి ఘడియలు ప్రారంభమయ్యాయి
అక్టోబరు 29 శనివారం ఉదయం 10.23 వరకూ చవితి ఘడియలు ఉన్నాయి
వాస్తవానికి రాత్రివేళ చేసే పండుగలు ( దీపావళి, అట్ల తదియ,కార్తీక పౌర్ణమి) అయితే రాత్రికి తిథి ఉండడం ప్రధానం. మిగిలిన అన్ని పండుగలకు సూర్యోదయానికి తిథి ఉండడమే లెక్కలోకి వస్తుంది.
నాగుల చవితికి సూర్యోదయానికి తిథి ప్రధానం కాబట్టి శనివారమే నాగుల చవితి జరుపుకోవడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు పండితులు...
సాధారణంగా ఉదయం సమయంలో వర్జ్యం,దుర్ముహూర్తాలు ఉన్నా ఆ టైమ్ లో పుట్టలో పాలుపోయరు...
శనివారం పరిశీలిస్తే... ఉదయం 5.58 నుంచి 7.34 వరకూ వర్జ్యం ఉంది
దుర్ముహూర్తం రాత్రి 7.31 నుంచి 9.10 వరకు ఉంది...
వర్జ్యం పోయిన తర్వాత అంటే ఏడున్నర తర్వాత....చవితి ఘడియలు దాటిపోకుండా అంటే దాదాపు పదిన్నర లోపు నాగేంద్రుడి పూజ చేయాలి...
నోట్: ఇవి పండితులు నుంచి సేకరించిన వివరాల ఆధారంగా రాసినది, దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం..