చాణక్య నీతి: ఇలాంటి వాళ్లు శత్రువుల కన్నా ప్రమాదకరమైనవారు



గొప్ప వ్యూహకర్త, పండితుడు, ఉపాధ్యాయుడు, సలహాదారుడు, ప్రాచీన భారతదేశపు ఆర్థికవేత్త...మౌర్య వంశం విజయం వెనుక చాణక్యుడి దౌత్యం ఉంది.



గొప్ప వ్యూహకర్త, ఆర్థికవేత్త అయిన చాణక్యుడు తన విధానాల బలంతో నంద వంశాన్ని నాశనం చేసి...చంద్రగుప్త మౌర్యను మగధ చక్రవర్తిగా చేశాడు.



చాణక్యుడికి రాజకీయాల గురించి మాత్రమే కాదు సమాజంలోని ప్రతి విషయం గురించి లోతైన జ్ఞానం, అంతర్దృష్టి ఉంది



చాణక్యుడి రచనలను అందులో ప్రస్తావించిన వ్యూహాలను ఇప్పటికీ ఎందరో పాలకులు, నాయకులు , ప్రసిద్ధ వ్యక్తులు అనుసరిస్తున్నారు.



మన చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు శత్రువుల కన్నా ప్రమాదకరమైనవారన్న చాణక్యుడు..వీరినుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ సహాయం ఆశించకూడదన్నాడు



నవ పశ్యతి జన్మంధః కమాన్ధః కమంధో నైవ పశ్యతి.
మదోన్మత్త న పశ్యంతి ఆర్తి దోష న పశ్యతి ..



ఒక గుడ్డివాడు పుట్టినప్పటి నుంచీ దేనినీ చూడలేనట్లే, అదే విధంగా కోపంలో, మత్తులో ఉన్న వ్యక్తి దానిని తప్ప మరేమీ చూడడు. స్వార్థపరుడికి కూడా అంతే..తన ఉపయోగం తప్ప మరో ఆలోచన ఉండదు..సహాయం చేయాలనే తపనా ఉండదు.



కామవాంఛ అధికంగా ఉన్నవారు తమ కోరిక నెరవేర్చుకోవడంపై తప్ప మరో విషయంపై శ్రద్ధ ఉండదు. పైగా వీరుతమ అవసరం తీర్చుకునేందుకు హాని చేయడానికి కూడా వెనుకాడరు. అందుకే ఇలాంటి వారినుంచి ఎలాంటి సహాయం అర్థించవద్దు



దుష్టులు, అత్యాశ పరులు కూడా ఇతరుల పురోగతిని చూసి అసూయపడతారు. ఇలాంటి వారితో స్నేహం చేయరాదు,సహాయం కోరరాదు. ఒకవేళ సహాయం చేస్తామని చెప్పినా అది నటనే అవుతుంది..అందులోనూ వారి ప్రయోజనం చూసుకుంటారు



స్వార్థపరుడు తన జీవితంలో తన ప్రయోజనం మాత్రమే చూసుకుంటాడు. తన స్వార్థం కోసం ఇతరులను ట్రాప్ చేస్తారు. ఇలా౦టి వ్యక్తి మీకు జీవిత౦లో ఎప్పుడూ సహాయ౦ చేయడు కానీ తన సొ౦త ప్రయోజనాన్ని పొ౦దుతాడు.