చాణక్య నీతి: ఇలాంటి స్వభావం ఉన్నవారికి పొరపాటున కూడా సలహాలు ఇవ్వకండి



చాణక్యడు బోధించిన విషయాలు జీవితంలో విజయం సాధించడానికి మనిషిని ప్రేరేపిస్తాయి.



ఆచార్య చాణక్యుడు జీవితంలోని ప్రతి రంగానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను నీతిశాస్త్రంలో పేర్కొన్నాడు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుంటే ఆ వ్యక్తి సమస్యలను దూరం చేసుకోవచ్చని చెబుతారు.



ఒక వ్యక్తి సంతృప్తికరమైన మరియు విజయవంతమైన జీవితాన్ని ఎలా గడపాలో, ఎలా ఉండాలో ,ఎలా ఉండకూడదో కూడా బోధించాడు



నైతికత గురించి ప్రస్తావించిన చాణక్యుడు..నైతిక విలువలు లేని వ్యక్తులకు సలహాలు ఇస్తే వారు వినకపోగా..మీకు శత్రువులగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించాడు చాణక్యుడు



మూర్ఖుడికి సలహా ఇవ్వొద్దు
మీ మాటలకు గౌరవం ఇచ్చి ఆచరించే వ్యక్తులకు మాత్రమే సలహాలు సూచనలు ఇవ్వాలి..మూర్ఖులకు సలహా ఇస్తే అనవసర వాదన తప్ప ప్రయోజనం ఉండదు



తప్పుడు వ్యక్తులకు
స్వభావరీత్యా తప్పు చేసేవారు..ఎదుటి వ్యక్తులను ఎప్పుడూ తప్పుగానే, శత్రువులుగానే చూస్తారు. పైగా ఏ క్షణం అయినా మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి అలాంటి వారికి సలహాలు ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.



అత్యాశపరులకు
చాణక్య విధానం ప్రకారం అత్యాశ గల వ్యక్తికి సలహా ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు. వారికి సలహా ఇవ్వడం అంటే వారిని మీ శత్రువులుగా మార్చుకోవడమే.



అత్యాశపరులు డబ్బు అనే దురాశతో ప్రతీదీ చేస్తారు, తప్పుడు మార్గంలో నడవడానికి కూడా వెనుకాడరు



అనుమానించే వ్యక్తులకు
మనపై నమ్మకం లేకపోయినా పర్వాలేదు కానీ అనుమానం ఉండకూడదు. అలాంటి వ్యక్తులకు ఎప్పుడూ దూరంగా ఉండడమే మంచిది. సలహాలు,సూచనలు అస్సలు ఇవ్వకపోవడం ఇంకా ఉత్తమం