చాణక్య నీతి: ఎక్కడ తగ్గాలో చెప్పిన చాణక్యుడు ఆచార్య చాణక్యుడి విధానాలు అనుసరిస్తే ఎవరైనా తమ జీవితాన్ని ఉత్తమంగా మార్చుకోగలుగుతారు కష్టం, ఓటమి నుంచి ఎలా బయటపడాలో చెప్పిన చాణక్యుడు..ఏ విషయాల్లో వెనక్కు తగ్గితే మంచి జరుగుతుందో కూడా వివరించాడు కొన్ని సందర్భాల్లో ముందుకు దూకే కన్నా వెనకడుగు వేయడం వల్లే మంచి జరుగుతుందన్నాడు చాణక్యుడు అనుకోకుండా శత్రువు ఎదురైనప్పుడు అనవసర వివాదం పెట్టుకునే కన్నా అక్కడి నుంచి తప్పుకుపోవడం మంచిది. ఎందుకంటే అప్పటికే తను ఓ వ్యూహంతో వచ్చి ఉంటాడని గుర్తించాలి. ఆ క్షణం తప్పించుకుంటే మళ్లీ మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోగలుగుతారు.. నేరస్తుడు ఎదురైనప్పుడు కూడా అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవడం ఉత్తమం...నేరస్తుడు ఒకవేళ మీ సహాయం కోరినా కానీ తనకి సహాయం చేయడం సరికాదు ఎక్కడైనా హింస, అల్లర్లు చెలరేగినప్పుడు కూడా అక్కడ ఉండకపోవడం మంచిదని చెప్పాడు చాణక్యుడు. అనవసర అల్లర్ల మధ్య దాడులకు గురయ్యే కన్నా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోవడం తెలివైన వారి లక్షణం అన్నాడు సామాజిక వనరులు సరిగా లేని ప్రాంతం మాత్రమే కాదు..ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైన ప్రాంతానకి కూడా దూరంగా ఉండడం మంచిది. కాదు కూడదు అని మొండిగా వ్యవహరిస్తే మీతో పాటూ కుటుంబానికి కూడా ఇబ్బందులు తప్పవని గ్రహించాలి