ఈరోజున చంద్రగ్రహణం మధ్యాహ్నం 2.38 నిమిషాల నుంచి సాయంత్రం 6.18 నిమిషాల మధ్య ఏర్పడుతోంది. గ్రహణ వ్యవధి దాదాపు 45 నిమిషాల 49 సెకన్లు ఉంది. ఈ సమయంలో చాలా దేవాలయాలు మూసి ఉంటాయి. గ్రహణ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలను వండకూడదు, తినకూడదు చిన్నపిల్లలు లేదా ముసలివాళ్లు, గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవాళ్లు ఉంటే వారికి ఈ నియమం వర్తించదు. గ్రహణ సమయంలో నిద్రించకూడదు..అలాగే ప్రయాణాలు కూడా చేయకూడదు. సూతకాలం మొదలైన తర్వాత ఎలాంటి శుభకార్యాలు, పూజులు చేయకూడదు. నిలువ ఉండే పదార్థాలపై దర్భలను వేసి ఉంచాలి. గర్భిణులు పుట్టబోయే బిడ్డపై దీని ప్రభావం పడకూడదు కనుక ఈ గ్రహణ సమయంలో బయటకి వెళ్లకూడదు. అలాగే గ్రహణం తర్వాత ఇంటిని శుభ్రం చేసి, తలస్నానం చేసి మళ్లీ శుచిగా ఆహారాన్ని వండుకుని తినాలి.