అన్వేషించండి

Horoscope 2023: 2023లో ఈ రాశివారు అన్నింటా సక్సెస్ అవుతారు, ఏడాది సెకండాఫ్ అద్భుతంగా ఉంటుంది

Horoscope 2023: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

Aries Horoscope 2023: 2022 ఏడాది చివరికి వచ్చేశాం..2023 లోకి అడుగుపెట్టేయబోతున్నాం. గడిచిన సంవత్సరంలో మంచిని గుర్తుచేసుకుంటూ చెడును వదిలేస్తూ ముందుకు అడుగేయాలి. మరి కొత్త ఏడాది మేష రాశివారికి ఎలా ఉందో చూద్దాం...

2023 సంవత్సరం ప్రారంభంలో వృషభ రాశిలో తిరోగమనంలో ఉన్న కుజుడు మీ రాశికి రెండో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో మీరు ఆర్థికంగా బలపడతారు ..అయితే మీ మాట జోరు మాత్రం తగ్గించుకోవాలి.  ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లాలి అనుకునే విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమికుల విషయానికొస్తే 2023 లో మీ జీవితం ఆనందంగా ఉంటుంది. అంగారకుడు ఐదో స్థానంలో ఉండడం వల్ల మీ ప్రియమైన వారి హృదయాన్ని గెలుచుకోవడానికి కోపాన్ని నియంత్రించుకోవాలి. జనవరి 17న శని మీ పదవ ఇంటి నుంచి పదకొండవ స్థానానికి వెళుతుంది, ఇది మీ ఆర్థిక అభివృద్ధికి నాంది పలుకుతుంది. ఆ తరువాత క్రమంగా మీరు మెరుగుపడతారు..

2023 లో మేషరాశి ఫలితాలు

  • మేషరాశివారు 2023లో జీవితంలోని వివిధ కోణాల్లో విజయం సాధించగలరు..ఏ రంగంలో ఉన్నవారైనా మంచి ఫలితాలు సాధిస్తారు
  • ఈ రాశివారికి లోతైన ఆలోచన ఉండడం వల్ల..ప్రతి విషయాన్నీ తీవ్రంగా ఆలోచిస్తారు..ఆ స్థాయి పెరిగి కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది.
  • రాహువు సంచారం మిమ్మల్ని నిరంకుశంగా మార్చుతుంది..మీ చుట్టూ ఉన్న ప్రతిదాన్ని సరిగ్గా గుర్తించడంలో విఫలమవుతారు..తద్వారా మీ సంబంధాలు కొన్ని ఇబ్బందికరంగా మారుతాయి
  • 2023 మొదటి ఆరు నెలలు కన్నా తర్వాత ఆరునెలలు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో మీరు తలపెట్టిన పనులున్నీ కలిసొస్తాయి. నిర్ణీత సమయం కన్నా ముందే పనులు పూర్తిచేస్తారు.
  • ఉద్యోగులకు కార్యాలయంలో కీర్తి పెరుగుతుంది..పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు
  • తొందరపడి పనులు చేయాలి అనుకోకుండా చేసిన పని సరిగ్గా చేసేందుకు ప్రయత్నించండి
  • అవివాహితులకు ఈ ఏడాది సంబంధాలు కుదురుతాయి
  • వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నా, స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకున్నా ఈ ఏడాది మీ కోరిక నెరవేరుతుంది
  • కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వారి నుంచి మీకు సంపూర్ణ మద్దతు ఉంటుంది
  • మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కుటుంబం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది

Also Read: దేవుడు తినడు కదా మరి నైవేద్యం ఎందుకు పెట్టాలి!

మేష రాశివారి 2023లో నెలవారీ ఫలితాలు  

  • సంవత్సరం ప్రారంభంలో తొమ్మిదవ ఇంట సూర్యుడు, పదో స్థానంలో  శని ఉండటం వల్ల ఓ గొప్పపని చేయాలనే సంకల్పం పెట్టుకుంటారు..తద్వారా మంచి పేరు పొందుతారు
  • ఫిబ్రవరిలో శుక్రుడు పదకొండో స్థానంలో సంచరించడం వల్ల స్నేహితుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది.  ప్రేమ జీవితం కూడా అందంగా ఉంటుంది. 
  • మార్చిలో కుజుడు మూడో స్థానంలో ప్రవేశించడం వల్ల మీకు ధైర్యం,  దృఢ సంకల్పం పెరుగుతుంది. తోబుట్టువుల మద్దతు ఉంటుంది కానీ శారీరక అనారోగ్యం ఇబ్బంది పెట్టవచ్చు.
  • ఏప్రిల్‌లో బృహస్పతి మీ రాశిలోకి ప్రవేశిస్తుంది.. ఈ ఫలితంగా పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, అదృష్టం కలిసొస్తుంది. ఆగిపోయిన పనులు వేగవంతం అవుతాయి
  • మే - జూన్ మధ్యలో ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో కుటుంబ సంపద గురించి వివాదాలు ఉండవచ్చు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
  • జూలై -ఆగస్టు మధ్య మీరు మీ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు.  కోర్టు సంబంధిత విషయాల్లో విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మీరు వ్యాపారవేత్త అయితే, మీ వ్యాపారం కొత్త రంగాలలో విస్తరించవచ్చు .  కెరీర్‌లో ప్రమోషన్ అవకాశాలు బలంగా ఉన్నాయి.
  • సెప్టెంబరు-అక్టోబరులో మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీ ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది.
  • నవంబర్-డిసెంబరులో మీ ఖర్చులు పెరుగుతాయి. రాహువు పన్నెండో స్థానంలో సంచరించడం వల్ల అనుకోని తప్పించుకోలేని ఖర్చులుంటాయి...కానీ మీ వ్యక్తిగత జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. మేషరాశి విద్యార్థులకు మాత్రం సవాల్ గా ఉంటుంది

Also Read: 'అంతా మా కర్మ', 'ప్రారబ్ధం' అంటారు కదా, ఎందుకలా అంటారు - కర్మ అంటే ఏంటి!

ఓవరాల్ గా చెప్పుకుంటే...
మేష రాశివారికి 2023 చివరి నాటికి కెరీర్లో విజయం సాధిస్తారు..కొత్త వ్యక్తులను కలవడం వల్ల వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఈ ఏడాదికాలం మీకు చాలా నేర్పిస్తుంది. అసహన వైఖరి విడిచిపెట్టాలి..తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులున్నాయయయ మీ జీవిత భాగస్వామి మద్దతుతో జీవితంలో ముందడుగు వేస్తారు...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Metro Train: పెను సవాలుగా ఓల్డ్ సిటీ మెట్రో మార్గం! సున్నితంగా పట్టాలెక్కడం సాధ్యమేనా?
పెను సవాలుగా ఓల్డ్ సిటీ మెట్రో మార్గం! సున్నితంగా పట్టాలెక్కడం సాధ్యమేనా?
Tirumala News:తిరుమల గోశాలలో టీడీపీ నేతలు- రోడ్డుపై వైసీపీ లీడర్లు- తిరుమలలో ఏం జరిగింది?
తిరుమల గోశాలలో టీడీపీ నేతలు- రోడ్డుపై వైసీపీ లీడర్లు- తిరుమలలో ఏం జరిగింది?
Andhra Pradesh Latest News: మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు
మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు
Bhu Bharathi Portal Telangana: భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?
భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mitchell Starc vs Yashasvi Jaiswal in IPL 2025 | స్టార్క్ వర్సెస్ జైశ్వాల్  | ABP DesamAxar Patel Kuldeep Yadav vs RR | IPL 2025 లో ఢిల్లీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న అక్షర్, కుల్దీప్DC vs RR Super Over Failure | IPL 2025 లో తొలి సూపర్ ఓవర్..చేతులారా నాశనం చేసుకున్న RRMitchell Starc vs Yashasvi Jaiswal | IPL 2025 లో కొనసాగుతున్న స్టార్క్ వర్సెస్ జైశ్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro Train: పెను సవాలుగా ఓల్డ్ సిటీ మెట్రో మార్గం! సున్నితంగా పట్టాలెక్కడం సాధ్యమేనా?
పెను సవాలుగా ఓల్డ్ సిటీ మెట్రో మార్గం! సున్నితంగా పట్టాలెక్కడం సాధ్యమేనా?
Tirumala News:తిరుమల గోశాలలో టీడీపీ నేతలు- రోడ్డుపై వైసీపీ లీడర్లు- తిరుమలలో ఏం జరిగింది?
తిరుమల గోశాలలో టీడీపీ నేతలు- రోడ్డుపై వైసీపీ లీడర్లు- తిరుమలలో ఏం జరిగింది?
Andhra Pradesh Latest News: మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు
మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు
Bhu Bharathi Portal Telangana: భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?
భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?
Layoff Threat: 40 ఏళ్లు దాటినవాళ్లకు బిగ్ అలర్ట్-  మీ ఉద్యోగం ఎప్పుడైనా ఊడిపోవచ్చు!
40 ఏళ్లు దాటినవాళ్లకు బిగ్ అలర్ట్- మీ ఉద్యోగం ఎప్పుడైనా ఊడిపోవచ్చు!
Leopard News: ఆటో బ్రేక్ వైర్లతో కడుపుతో ఉన్న చిరుతను చంపేశారు- ఇలాంటి వాళ్లకు శిక్షలు ఉంటాయా?
ఆటో బ్రేక్ వైర్లతో కడుపుతో ఉన్న చిరుతను చంపేశారు- ఇలాంటి వాళ్లకు శిక్షలు ఉంటాయా?
Tirumala Goshala : తిరుమల గోశాల ఎప్పుడు ప్రారంభించారు? ఆవులు ఇవ్వాలనుకుంటే ఏం చేయాలి?
తిరుమల గోశాల ఎప్పుడు ప్రారంభించారు? ఆవులు ఇవ్వాలనుకుంటే ఏం చేయాలి?
UGC NET Notification : యూజీసీ నెట్ నోటిఫికేషన్ రిలీజ్‌- జూన్ పరీక్షకు  ప్రక్రియ ప్రారంభం, ఇలా రిజిస్టర్ చేసుకోండి
యూజీసీ నెట్ నోటిఫికేషన్ రిలీజ్‌- జూన్ పరీక్షకు ప్రక్రియ ప్రారంభం, ఇలా రిజిస్టర్ చేసుకోండి
Embed widget