చాణక్యుడు చెప్పిన నీతిసూత్రాలు జీవితానికి సరైన మార్గాన్ని చూపిస్తాయి. చాణక్యుడి విధానాలు, సూచనలు అనుసరిస్తే ఎంత క్లిష్టపరిస్థితులను అయినా ధైర్యంగా ఎదుర్కోవచ్చు
కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించడమే కాదు..ఆ కష్టం నుంచి బయటపడి విజయం వైపు నడిపించేందుకు మార్గదర్శకాలు చాణక్యుడి నీతివాక్యాలు
ఒక వ్యక్తి జీవితంలో చాలా తప్పులు చేస్తాడు. ఆ తర్వాత పశ్చాత్తాప పడతాడు. అందరితో మంచి సంబంధాలు కొనసాగించినప్పుడే ఆ జీవితానికి అందం, అర్థం, ఆనందం
ముఖ్యంగా ఎవరితో ఎలా ఉన్నా ఈ నలుగురితో అస్సలు విభేదాలు పెట్టుకోవద్దన్నాడు చాణక్యుడు
1.మూర్ఖుడు మూర్ఖుడితో ఎప్పుడూ వాదన పెట్టుకోకూడదు. వాస్తవం అవాస్తవం పక్కనపెట్టి మూర్ఖంగా తనకు తెలిసిందే గొప్ప అనుకునే వారితో వాదించడం వల్ల ఉపయోగం ఉండకపోగా సమయం వృధా అవుతుంది
2.గురువు ఉన్నతంగా తీర్చిదిద్దే గురువుకి ఓ మాట అనే హక్కు ఉంటుంది, అవసరం అయితే దండించే హక్కూ ఉంటుంది. అలాంటప్పుడు తలొంచుకుని తప్పులు సరిదిద్దుకోవాలి కానీ తిరిగి వాదనకు దిగరాదు
గురువు ఆగ్రహానికి గురై బాగుపడిన వారు పురాణకాలం నుంచి ఇప్పటివరకూ ఎవ్వరూ లేరు. గురువు లేకుండా పొందిన జ్ఞానం ఎందుకూ పనికిరాదనే నిజాన్ని గ్రహించాలి
3.ఇష్టమైన వారు మీరు ఇష్టపడే, ప్రేమించే వారితో వాదనలు, విభేదాలు ఉండకూడదు. ఈ ప్రభావం మీ భవిష్యత్ పై పడుతుంది. ప్రియమైన వారితో వాదన వల్ల వారికన్నా మీకే నష్టం
4. స్నేహితుడు సంతోషాన్ని, బాధను నిర్భయంగా చెప్పుకునే స్నేహితుడు ప్రతి ఒక్కరు జీవితంలో ఉంటారు. చేసే తప్పొప్పులను వేలెత్తి చూపించి మంచివైపు నడిపించే ఇలాంటి స్నేహితులను విభేదించరాదు
మరీ ముఖ్యంగా మీ రహస్యాలు అన్నీ తెలిసిన స్నేహితుడితో విరోధం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మీపై వ్యతిరేకత ఏర్పడేలా ప్రవర్తితే ఆ బాధలో అయినా మీ సీక్రెట్స్ ని ఇతరులకు చెప్పే ప్రమాదం ఉంటుంది.