చాణక్య నీతి: ఈ విషయాల్లో అసంతృప్తి మంచిదన్న చాణక్యుడు



మ‌నిషి జీవితంలో రెండు కీలకం...ఒకటి సంతృప్తి మరొకటి అసంతృప్తి



ప్ర‌తి ప‌నిలో ప్ర‌తి మ‌నిషి సంతృప్తి కావాలనుకుంటాడు..అయితే కొన్ని విషయాల్లో అసంతృప్తి మంచిదే అంటాడు



చాణక్య నీతిశాస్త్రంలో ఈ రెండు విషయాల గురించి కూలకంషంగా వివరించాడు చాణక్యుడు



జీవితంలో ఆయా సంద‌ర్భాల‌ను బ‌ట్టి సంతృప్తి, అసంతృప్తి రెండూ కూడా మ‌న జీవితాల్లో ఏదో ఒక రూపంలో ప్రయోజనాన్ని నింపుతాయన్న చాణక్యుడు..అవి ఏ రూపంలో ఉంటాయనేది అర్థం చేసుకోవాలని చెప్పాడు



అసంతృప్తి అనేది మ‌నిషిని మ‌రింత క‌ష్ట‌ప‌డేలా చేస్తుంద‌ని, త‌ద్వారా అత‌ని జీవితం ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించేలా ఉపయోగపడుతుంది



జీవిత భాగస్వామి, తినే ఆహారం విషయంలో సంతృప్తి ఎంత అవసరమో...విద్య, జ్ఞానం లాంటి విషయాల్లో అసంతృప్తి అంత అవసరం అని చెప్పాడు చాణక్యుడు



అసంతృప్తిగా ఉండాల్సిన మరో విషయం దానం... దానం, సహాయం చేయడంలో కూడా ఎప్పటికీ అసంతృప్తే ఉంటే మరికొందరకి సహాయం చేసినవారమవుతాం



దేవుడిని స్మరించడంలోనూ అంసతృప్తే ఉండాలి.. భగవంతుడిని ఎంత ప్రార్థిస్తే అంత మేలు జరుగుతుంది..అందుకే నిత్యం భగవతారాధనలో ఉండడం వల్ల అన్నీ శుభఫలితాలే ఉంటాయి