చాణక్య నీతి: ఆ సమయంలో అందం, తెలివి, సంపద అన్నీ వృధానేచాణక్యుడు చెప్పిన నీతిసూత్రాలు జీవితానికి సరైన మార్గాన్ని చూపిస్తాయికష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించడమే కాదు..ఆ కష్టం నుంచి బయటపడి విజయం వైపు నడిపించేందుకు మార్గదర్శకాలు చాణక్యుడి నీతివాక్యాలుఅందం, తెలివి, సంపద గురించి చాణక్యుడు ముఖ్యమైన విషయాలు చెప్పాడుచాణక్య నీతి ప్రకారం ధర్మ ప్రవర్తన లేని వ్యక్తి అందం వ్యర్థంజ్ఞానం ఉండీ లక్ష్యాన్ని అందుకోకపోతే ఆ తెలివి వృధాసక్రమంగా వినియోగించుకోలేని ధనం ఉన్నా లేనట్టేచాణక్యుడి ప్రకారం శరీర సౌందర్యానికి వారిలో గుణాలకు ఎలాంటి సంబంధం ఉండదు. ఒకరు అందంగా ఉన్నా వారిలో సద్గుణాలు లేకుంటే ఆ అందం వృథానే. ధర్మ ప్రవర్తన లేని అందం వల్ల ఉపయోగం ఉండదుదుష్ట స్వభావం కలిగి ఉంటే.. ఎంత ఉన్నతమైన వ్యక్తి అయినా ఆ వ్యక్తి కారణంగా కుటుంబం సర్వనాశనం అయ్యే ప్రమాదం ఉందిప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక లక్ష్యంతో జీవిస్తాడు. అందుకోసం విద్యను అభ్యసిస్తాడు. కానీ లక్ష్యాన్ని సాధించలేని విద్య నిరుపయోగం కిందే లెక్క. విద్యకు జ్ఞానం తోడైనప్పుడు మాత్రమే జీవితానికి సరైన దిశ ఏర్పడుతుంది.ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం డబ్బుకు మూడు లక్షణాలున్నాయి. మొదటిది ఆనందం, రెండోది దాతృత్వం, మూడోది విధ్వంసం. అంటే ధనాన్ని ఆనందం కోసం ఉపయోగించాలి.


Thanks for Reading. UP NEXT

కార్తీకమాసంలో ఒక్కసారైనా ఈ అష్టకం చదువుకోండి!

View next story