శివుడికి ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం!



విష్ణువు అలంకారప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడు. శిరస్సుపై గంగను ధిరించినా గంగాధరుడికి అభిషేకం అంటే మహా ఇష్టం.



అందుకే శివార్చనలో ముఖ్యమైనది అభిషేకమే. అయితే అభిషేకం కోసం వినియోగించే ద్రవ్యాల్లో ఒక్కో దానికి ఒక్కో విశిష్టత, పరమార్థం ఉంది.



ఆవు పాలు - సర్వ సుఖాలతో వర్థిల్లుతారు
ఆవు పెరుగు - ఆరోగ్యం, బలం
ఆవు నెయ్యి - ఐశ్వర్యాభివృద్ధి



చెరకు రసం (పంచదార)- దుఃఖ తొలగిపోతుంది, ఆకర్షణ పెరుగుతుంది
తేనె - తేజస్సు వృద్ధి చెందుతుంది
భస్మ జలం - పాపాలు నశిస్తాయి



సుగంధోదకం - పుత్ర లాభం
పుష్పోదకం - భూలాభం, స్థిరాస్తి కొనుగోలు చేస్తారు
బిల్వ జలం - భోగ భాగ్యాలు కలుగుతాయి



నువ్వుల నూనె - మృత్యు దోషం తొలగిపోతుంది
రుద్రాక్షోదకం - ఐశ్వర్యం పెరుగుతుంది
సువర్ణ జలం - దరిద్ర నాశనం



అన్నాభిషేకం - సుఖ జీవనం
ద్రాక్ష రసం - సకల కార్యాభివృద్ధి
నారికేళ జలం - సర్వ సంపద వృద్ధి



ఖర్జూర రసం - శత్రు నాశనం
దూర్వోదకం (గరిక జలం)- ఆర్థిక వృద్ధి
ధవళొదకమ్ - శివ సాన్నిధ్యం పొందుతారు



గంగోదకం - సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి
కస్తూరీ జలం - చక్రవర్తిత్వం, రాజసం
నేరేడు పండ్ల రసం - వైరాగ్యం
నవరత్న జలం - గృహ ప్రాప్తి



మామిడి పండు రసం - దీర్ఘకాలిక వ్యాధులు నశిస్తాయి
పసుపు, కుంకుమ - మంగళ ప్రదం
విభూది - కోటి రెట్ల ఫలితం లభిస్తుంది
Images Credit: Pinterest