చాణక్య నీతి: ఈ మూడు ఆనందాలు లేని జీవితం నిరర్థకం



ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆనందం కోసం తహతహలాడుతుంటాడు. మానసిక, శారీరక ఆనందం రెండూ మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైనవి.



కానీ ఉరకల పరుగుల జీవితంలో కొన్ని ఆకర్షణలకు లోనై అసలైన ఆనందాన్ని పొందలేకపోతున్నారు



ప్రపంచంలోని ఈ 3 విలువైన వస్తువులను కలిగి ఉన్న వారి జీవితం భూమిపై స్వర్గం లాంటిదన్నాడు



ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో 14వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో... భూమిపై ఉన్న మూడు విలువైన రత్నాలు ( ఆనందాల) గురించి చెప్పాడు. ఇవి లేని జీవితాన్ని ఊహించడం అసాధ్యం.



పృథివ్యాం త్రీణి రత్నాని జలమన్నం సుభాషితమ్ ।
ముధై: రాతి శకలాలు రత్న నామవాచక పద్ధతి



మొదటి ఆనందం
వజ్రం, ముత్యం, మరకతం, బంగారం లాంటివి అత్యంత విలువైనవి అనుకుంటున్నారు కానీ అంతకుమించిన విలువైన ఆహారం-నీరు. చాణక్య నీతి ప్రకారం.. సంపాదన ఎంతున్న కడుపునిండా తినగలిగే వాడే సంతోషంగా ఉన్నట్టు.



పాపపు కడుపుని నింపేందుకు డబ్బు సంపాదిస్తారు కానీ అందరకీ అంత ఆనందకర వాతావరణంలో ఆహారం దొరకదు. ఈ ఆనందం ఉన్న వ్యక్తికన్నా అదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు



రెండవ ఆనందం
మాటల్లో మాధుర్యాన్ని నింపుకున్న వారు శత్రువుని కూడా అభిమానిగా మార్చుకోగలరు. ఇది జీవితంలో ఆనందానని రెట్టింపు చేసే రెండో అంశం



ఒక నిశ్శబ్దం వంద ప్రశ్నలకు సమాధానం...తప్పుగా మాట్లాడటం కంటే మౌనంగా ఉండటమే మేలు. ఓ పద్ధతిని అనుసరించి మాట్లాడేవారి గౌరవం రోజురోజుకీ వందరెట్లు పెరుగుతుంది



మూడవ ఆనందం
మనశ్శాంతిని మించిన గొప్ప సంపదేముంది అంటాడు చాణక్యుడు. ఎవరైతే పూర్తిగా ప్రశాంతంగా ఉంటారో వారి జీవితంలో సంతోషానికి తప్ప బాధకి చోటుండదు



డబ్బు దురాశలో పడి మనిషి ఈ ఆనందానికి దూరమైపోతున్నాడు. ఈ కారణంగానే మానసిక ప్రశాంతత పోగొట్టుకోవడంతో పాటూ అనేక వ్యాధుల బారిన పడుతున్నాడు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే అన్నింటా విజయం మీ సొంతమవుతుంది