అయ్యప్ప దీక్ష వెనుకున్న ఆరోగ్య రహస్యం



నేలమీద నిద్రపోవడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుంది, కండరాలు పటిష్టంగా ఉంటాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.



తెల్లవారు జామునే నిద్రలేవడం చైతన్యానికి ప్రతీక. సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరంలో నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. తద్వారా ముఖంలో ప్రశాంతత కనిపిస్తుంది



స్నానానంతరం దీపారాధన కాంతి ఆవరణ మొత్తాన్ని ఆధ్యాత్మికంగా మార్చేస్తుంది. శ్రద్ధగా పూజ చేయడం వల్ల మనసు తేలికపడుతుంది.



సామూహికంగా కలిసి ఉండటం ద్వారా క్రమశిక్షణ అలవడుతుంది. ఇతర భక్తులతో ఇచ్చిపుచ్చుకునే స్వభావం మరింత పెరుగుతుంది.



నిత్యం రెండు పూటలా దుస్తులు మార్చడం ద్వారా పరిశుభ్రమైన దుస్తులు ధరించడం అలవాటవుతుంది.



క్రమం తప్పకుండా పూజలో పాల్గొనడం వల్ల సంఘంతో కలసి జీవించడం తెలుస్తుంది



అధిక ప్రసంగాలకు, వివాదాలకు దూరంగా ఉండటం వల్ల సమయం వృధా కాకపోవడంతో పాటూ ఆలోచనా సామర్థ్యం మెరుగుపడుతుంది.



ఒక్కపూట భోజనం చేయడం వల్ల మితాహారాన్ని ప్రోత్సహించడమే కాదు..శాఖాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.



పొగ తాగడం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా ఆరోగ్యం, మనసు మెరుగుపడుతుంది



ఒక్కమాటలో చెప్పాలంటే శరీరాన్ని, మనస్సును అదుపులో ఉంచుకుని సన్మార్గంలో పయనింపజేసేదే అయ్యప్ప మండల దీక్ష.



మాలధారణకు తల్లిదండ్రులు, భార్య అనుమతి తప్పనిసరిగా ఉండాలి. జుట్టు,గోళ్లు ముందుగానే కట్ చేసుకోవాలి. తన శక్తి కొదలది ఒక్కసారైనా ఐదుగురు అయ్యప్పలకు భిక్ష పెట్టాలి.


Thanks for Reading. UP NEXT

చాణక్య నీతి: సముద్రం, పర్వతం మనిషికి ఉత్తమ గురువులు

View next story