భోజనం ఇలా తినేవారి చేతిలో డబ్బు నిలవదు



భోజనం చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలని మీకు తెలుసా. ఎలా తినాలి, ఎలా తినకూడదు. వాస్తవానికి తినే విధానం మీ మనస్తత్వాన్ని చెప్పేస్తుందంటారు పాకశాస్త్ర నిపుణులు.



చేతి వ్రేళ్ళు కలపకుండా ఆహారం తింటూ వ్రేళ్ళ మధ్య జార విడుస్తుంటారో వారి వద్ద డబ్బు నిలవదు



అన్నాన్ని పిసికి పిసికి తినే వారి జీవిత భాగస్వామి తనవల్ల జీవితాంతం బాధపడుతుంది



చేతి వ్రేళ్ళకు తిన్న తిండి అతుక్కుని ఉంటే వాళ్లు దరిద్రులు



ఎవరైతే వేళ్లు మొత్తం నోట్లో పెట్టుకుని జుర్రుకుంటూ తింటారో వారి వద్ద డబ్బు నిలవదు, పిశినారులు కూడా



చేతుల్ని నాకినాకి తినేవారు మిత్రద్రోహి, నమ్మకద్రోహి , మోసం చేసే గుణం కలిగి ఉంటారట.



అరచేయి సహా చుట్టుపక్కల మొత్తం నాకినాకి తినేవారికి పరస్త్రీ వ్యామోహం అధికంగా ఉంటుందట



నాలుగు వేళ్లతో జుర్రుకుని తినేవాడు పిశినారి
మొదట కారం కలుపుకుని తినేవారు డబ్బే పరమావధి అన్నట్టు ప్రవర్తిస్తారట. వీళ్లు బంధాలకు విలువ అస్సలు ఇవ్వరు.



పదార్థాలన్నీ ఒకేసారి కలిపేసుకుని తినేవారి ఆలోచనలు కూడా కలగూర గంపలా ఉంటాయట. వివిధ రకాల ఆలోచనలు చేసి, అన్నింటా తలదూర్చి ఏపనీ పూర్తి చేయకుండా , ఎందులోనూ ప్రవీణ్యత లేకుండా ఉంటారట.



ఏ పదార్థం తినాలో తెలియక అదోసారి, ఇదోసారి కలుపుకుని గందరగోళంగా తినేవారికి జీవితంపై స్పష్టత లేదని అర్థం. ఇలాంటి వాళ్లకి ఎప్పుడు ఏం కావాలో తెలియదట.



నోట్: కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి..వీటిని ఎంతవరకూ విశ్వసించాలో పూర్తిగా మీ వ్యక్తిగతం
Images Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

కాశీ యాత్ర: వారణాసి వెళుతున్నారా - మరి అక్కడ ఏం వదిలేయాలో తెలుసా!

View next story