News
News
X

Spirituality: 'అంతా మా కర్మ', 'ప్రారబ్ధం' అంటారు కదా, ఎందుకలా అంటారు - కర్మ అంటే ఏంటి!

Karma Phalam: ఏదైనా కష్టం వచ్చినా, వరుసగా ఇబ్బందులు వచ్చినా..ఈ మధ్య అన్నీ ఇలాగే జరుగుతున్నాయ్..ఏంటో అంతా మా కర్మ అంటుంటారంతా. అసలు ఈ పదం ఎందుకు వాడతారు..కర్మ అనే మాట అనొచ్చా లేదా..!

FOLLOW US: 
 
సత్కర్మభిశ్చ సత్ఫలితం
దుష్కర్మ ఏవ దుష్ఫలం
మంచి పనులు మంచి ఫలితాన్నిస్తాయి..చెడు పనులు చెడ్డ ఫలితాన్నే ఇస్తాయని దీని అర్థం. 
హిందూ మతం ప్రకారం మనిషి ఆధీనంలో కర్మ, భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి. ప్రతి మనిషి  పుట్టిన దగ్గర నుంచి చనిపోయేవరకు కర్మలు చేస్తూనే ఉంటారు. చేసే ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది. మనిషి చేసిన కర్మలకి అనుభవించే ఫలితాన్ని కర్మఫలం అంటారు. జీవితంలో ఎదురయ్యే ప్రతిదీ కర్మ ఫలితమే అంటారు పెద్దలు. అయితే ఈ పదాన్ని విరివిగా వాడేస్తుంటారు కానీ...కర్మ అంటే ఏంటి..అవెన్ని రకాలు..వేటిని ఏమంటారో తెలుసా..

కర్మలు 3 రకాలు....
1.ఆగామి కర్మలు
2.సంచిత కర్మలు
3.ప్రారబ్ద కర్మలు

Also Read: చంబల్‌ లో కొలువైన ఈ శివయ్య ఓ అధ్భుతం, ప్రత్యేకత ఏంటంటే

ఆగామి కర్మలు  
ప్రస్తుతం మనం చేస్తున్న ప్రతి కర్మ ఆగామి కర్మల క్రిందకే వస్తాయి. వాటిలో కొన్ని వెంటనే ఫలితాన్నిస్తాయి. మరికొన్ని తరువాత కాలంలో, కొన్ని మరు జన్మల్లో ఫలితాన్నిస్తాయి. అసలు కొన్ని  కర్మలు ఎలాంటి ఫలితాలను ఇవ్వకపోవచ్చు కూడా.  కొన్ని మాత్రం వెంటనే ఫలితాన్నివ్వకుండా తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వటం కోసం కూడబెట్టుకుని ఉంటాయి. అంటే మనం భోజనం చేస్తాం.. ఆ కర్మ ద్వారా వెంటనే ఆకలి తీరుతుంది. దానధర్మాలు చేస్తాం, పుణ్యకార్యాలు చేస్తాం..వాటి ఫలితం కొన్నాళ్ళకు తెలుస్తుంది. ఇలా కొన్ని కర్మలు అప్పుడే ఫలితం ఇవ్వకుండా ఆ తర్వాత ఎప్పుడో ఇస్తాయన్నమాట.

News Reels

సంచిత కర్మలు 
సంచిత కర్మలంటే  పితృదేవతల ద్వారా ప్రాప్తించిన కర్మలు. తల్లి దండ్రులు చేసిన అప్పులు కొడుకు తీర్చడం లాంటి కర్మ అన్నమాట. పూర్వ జన్మల్లో చేసిన ఆగామి కర్మల ఫలాలను వివిధ కారణాల వల్ల అనుభవించలేకపోతే అవి సంచిత కర్మలుగా మారుతాయి. అంటే వాటిని ఒక జన్మ నుంచి మరొక జన్మకి, అక్కడి నుంచి వేరొక జన్మకు బదిలీ అవుతాయన్నమాట. అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టిన జీవుడు మరో శరీరాన్ని వెతుక్కున్నా కర్మ ఫలాన్ని మాత్రం మూటగట్టుకుని తీసుకెళ్తాడట. ఇవే సంచిత కర్మలు.

Also Read: కలలో డబ్బు-బంగారం కనిపిస్తే ఏమవుతుంది, శుభమా-అశుభమా!

ప్రారబ్ధ కర్మలు
ప్రారబ్ద కర్మలు అంటే పూర్వ జన్మలో మనం చేసుకున్న పాప పుణ్యాల వల్ల కలిగే కర్మలు. సంచితంలో కూడబెట్టిన కర్మలు పక్వానికి వచ్చినప్పుడు అవిచ్చే ఫలితమే ప్రారబ్ధ కర్మలు. ప్రారబ్ద కర్మఫలాన్ని అనుభవించటం పూర్తయ్యేవరకు ఆ శరీరం ఉంటుంది. ఈ కర్మలన్నీ వదిలించుకుని పరిపూర్ణులమైతే మరో జన్మే లేదంటారు. అందుకే అంటారు అంతా మా ప్రారబ్ధం అంటారు. 

అంతా ప్రారబ్ధం అంటే ఇదే
ఎవరెవరు ఏ కర్మలు అనుభవించాలో, అందుకు అనువైన తల్లి గర్భాన్ని వారే ఎంచుకుంటారట. కూతురు, కొడుకు అనే బంధాలు లేవు..పూర్వ జన్మ కర్మఫలమే ఇదంతా అంటారు. కొంతమంది మానసిక వికలాంగులు చాలా ఆరోగ్యవంతమైన ,జన్యుపర సమస్యలు లేని తల్లిదండ్రులకు పుడుతుంటారు..అంటే పిల్లల నుంచి తల్లిదండ్రులు అనుభవించాల్సిన ప్రారబ్ధ కర్మ అది అని అర్థం. 

ఏ కర్మ తప్పించుకోవచ్చు-ఏ కర్మ తప్పించుకోలేం
పూజలు, యజ్ఞ యాగాదులు, దైవ దర్శనం ద్వారా ఆగామి కర్మల, మహాత్ముల సందర్శనంతో ఆగామి కర్మల నుంచి విమోచనం పొందవచ్చు.
మనకు తెలియకుండా ఎన్నో సూక్ష్మజీవులు చంపుతుంటాం. ఆ పాపం నుంచి విమోచనం కోసమే పూజలు, వ్రతాలు, పుష్కర స్నానాలు చేయాలని చెబుతారు. పితృదేవతలకు తర్పణం ఆరాధన, యజ్ఞం, హోమంతో కొంతవరకు సంచిత కర్మల నుంచి విమోచనం పొందొచ్చు 
ప్రారబ్ద కర్మలను మాత్రం ఎక్కుపెట్టిన బాణం లాంటివి. అనుభవించి తీరాల్సిందే. దాన్నుంచి తప్పించుకోవాలంటే భగవత్ నామస్మరణలో ఉండాలని చెబుతారు పండితులు.

కర్మఫలంపై భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడంటే...
కర్మణ్యేవాధి కరస్తే మాఫలేషు కదాచన |
మకర్మఫలహేతుర్భు, మాతే సంగోస్త్వకర్మణి ||   
కర్మలను ఆచరించుట యందె నీకు అధికారము కలదు కానీ, వాటి ఫలితముపైన లేదు. నీవు కర్మఫలమునకు కారణమూ కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదని అర్థం. ( ఆ కర్మ మంచిదా చెడ్డదా అని తెలుసుకోవడమే ధర్మం)

Published at : 16 Nov 2022 02:22 PM (IST) Tags: Spirituality Bhagavad Gita Occurences of karma phalam do yo u know about karma Sanchitta karma Prarabdha karma Agami karma three types of karma

సంబంధిత కథనాలు

Horoscope Today 5th  December 2022:  ఈ రాశివారికి 'మూడ్ స్వింగ్స్''ఉంటాయి, డిసెంబరు 5 రాశిఫలాలు

Horoscope Today 5th December 2022: ఈ రాశివారికి 'మూడ్ స్వింగ్స్''ఉంటాయి, డిసెంబరు 5 రాశిఫలాలు

Geetha Jayanthi2022: పరిపూర్ణమైన ఆనందం ఎక్కడ లభిస్తుంది, గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు!

Geetha Jayanthi2022: పరిపూర్ణమైన ఆనందం ఎక్కడ లభిస్తుంది, గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు!

Geetha Jayanthi2022: ఇవి తెలుసుకుంటే భగవద్గీత చదివినట్టే

Geetha Jayanthi2022:  ఇవి తెలుసుకుంటే భగవద్గీత చదివినట్టే

Geetha Jayanthi2022: ఈ రోజు గీతా జయంతి - భగవద్గీత మత గ్రంధం కాదు మనిషిగా ఎలా బతకాలో చెప్పే మార్గదర్శి

Geetha Jayanthi2022:  ఈ రోజు గీతా జయంతి - భగవద్గీత మత గ్రంధం కాదు మనిషిగా ఎలా బతకాలో చెప్పే  మార్గదర్శి

Horoscope Today 4th December 2022: ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Horoscope Today 4th  December 2022:  ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

10 రోజులు టైమ్ ఇస్తున్నా, దమ్ముంటే అవినీతి నిరూపించు: బండి సంజయ్‌కి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్

10 రోజులు టైమ్ ఇస్తున్నా, దమ్ముంటే అవినీతి నిరూపించు: బండి సంజయ్‌కి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం  - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!