అన్వేషించండి

Achaleshwar Mahadev: చంబల్‌ లో కొలువైన ఈ శివయ్య ఓ అధ్భుతం, ప్రత్యేకత ఏంటంటే

Achaleshwar Mahadev: పరమేశ్వరుడు లింగరూపంలో కొలువైన క్షేత్రాలెన్నో ఉన్నాయి... ఒక్కో క్షేత్రానిది ఒక్కో ప్రత్యేకత...రాజస్థాన్ లో ఉన్న అచలేశ్వర మహాదేవ మందిరంలో ఉన్న శివయ్య ప్రత్యేకత ఏంటంటే...

Achaleshwar Mahadev Temple: దేశంలో మహాదేవుని ఆలయాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. వాటిలో చంబల్‌ లో ఉన్న అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లా - మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉంది. ఈ ఆలయం వేల సంవత్సరాల నాటిదని కొందరు చెబితే 1875 నాటిదని మరికొందరు అంటారు.అప్పట్లో చంబల్ లోయ మొత్తం అధీనంలో ఉండేదని అందుకే ఎవ్వరూ అటువైపు వెళ్లేందుకు సాహసించేవారు కాదని మరికొందరు చెబుతారు. రాను రాను ఈ ఆలయం ప్రత్యేకత తెలిసి భక్తులు పోటెత్తడం మొదలెట్టారు...

Also Read: కలలో డబ్బు-బంగారం కనిపిస్తే ఏమవుతుంది, శుభమా-అశుభమా!

అచ్లేశ్వర్ ఆలయం ప్రత్యేకత
దేశంలో ఉన్న పురాతన శివాలయాల్లో 'అచలేశ్వర మహాదేవ మందిరం' ఒకటి. దీనికి దాదాపు 2500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడి గర్భగుడిలోని శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగం రోజులో మూడుసార్లు.. రంగులు మారుతూ ఉంటుంది. ఉదయం ఎరుపు వర్ణంలో, మధ్యాహ్నం కాషాయ రంగులో దర్శనమిస్తుంది. సాయంత్రం కాగానే ఈ శివలింగం నలుపు రంగులోకి మారిపోతుంది. మరో ప్రత్యేకత ఏంటంటే ఈ శివలింగం పక్కకు కదులుతూ ఉంటుంది. ఈ అద్భుత శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు.

నంది ప్రత్యేక ఆకర్షణ
ఇక్కడి శివాలయంలో ఇత్తడితో తయారుచేసిన 'నంది' మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. పంచలోహాలతో దీన్ని తయారు చేశారు. 

Also Read:  అష్టకష్టాలు పడ్డాం అంటారు కదా, అవేంటో తెలుసా అసలు!
శాస్రవేత్తలు తెలుసుకోలేకపోయారు
ఈ శివలింగం రంగులు మారడం, కదలడం వెనుకున్న కారణాలు తెలుసుకునేందుకు పురాతత్వ శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ..ఈ ఆలయంలో జరిగే అద్భుతాల రహస్యాన్ని ఇప్పటివరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఇంత మహిమగల ఆలయం అయినప్పటికీ అప్పట్లో దొంగల అధీనంలో ఉండడం ఓ కారణం, అక్కడకు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడం మరోకారణంగా..ఎవ్వరూ వెళ్లేవారు కాదు...కానీ రాను రాను అద్భుతాల గురించి తెలిసి భక్తుల రద్దీ ప్రారంభమైంది. 

శివషడక్షర స్తోత్రమ్( Shiva Shadakshara Stotram)

ఓంకారం బిన్దుసంయుక్తం నిత్యం ధ్యాయన్తి యోగినః | 
కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః ||1|| 

నమన్తి ఋషయో దేవా నమన్త్యప్సరసాం గణాః | 
నరా నమన్తి దేవేశం నకారాయ నమో నమః ||2|| 

మహాదేవం మహాత్మానం మహాధ్యాన పరాయణమ్ | 
మహాపాపహరం దేవం మకారాయ నమో నమః ||3|| 

శివం శాన్తం జగన్నాథం లోకానుగ్రహకారకమ్ | 
శివమేకపదం నిత్యం శికారాయ నమో నమః ||4|| 

వాహనం వృషభో యస్య వాసుకిః కణ్ఠభూషణమ్ | 
వామే శక్తిధరం దేవం వకారాయ నమో నమః ||5|| 

యత్ర యత్ర స్థితో దేవః సర్వవ్యాపీ మహేశ్వరః | 
యో గురుః సర్వదేవానాం యకారాయ నమో నమః ||6|| 

షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ | 
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||7|| 

ఇతి శ్రీరుద్రయామలే ఉమామహేశ్వరసంవాదే శివషడక్షరస్తోత్రం సంపూర్ణమ్ || 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Pushpa 2 Trailer Launch Live Updates: అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Embed widget