Lenin Movie : 'లెనిన్' సరసన వెన్నెలంటి మా 'భారతి' - భాగ్యశ్రీ క్యూట్ లుక్
Bhagyashri Borse : అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని 'లెనిన్' నుంచి హీరోయిన్ భాగ్యశ్రీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. సాంగ్‌లో ప్లెజంట్ క్యూట్ లుక్ అదిరిపోయింది.

Bhagyashri Borse First Look From Akhil Lenin Movie : అక్కినేని యంగ్ హీరో లేటెస్ట్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లెనిన్' మూవీ నుంచి బిగ్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఈ మూవీలో తొలుత హీరోయిన్‌గా శ్రీలీల అనుకున్నా అనుకోని కారణాలతో ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నారు. ఆమె స్థానంలో 'మిస్టర్ బచ్చన్' బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేస్తున్నారు. తాజాగా ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.
వెన్నెలంటి భారతి
ఈ మూవీలో భారతీ పాత్రలో భాగ్యశ్రీ నటిస్తున్నారు. సాంగ్‌లో స్టిల్ షేర్ చేయగా ప్లెజెంట్ లుక్ అదిరిపోయింది. 'వారెవా వారెవా... వహ్వా వారెవా... ఎన్నెలల్లే ఉంటాది మా భారతి' అంటూ మూవీ టీం స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ఈ నెల 5న రిలీజ్ కానుంది. ఈ మూవీకి 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేం మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండగా... లవ్ స్టోరీతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
Also Read : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
అఖిల్ ఖాతాలో ఇప్పటివరకూ కమర్షియల్‌గా మంచి హిట్ పడలేదు. ఆయన లాస్ట్‌గా నటించిన 'ఏజెంట్' మూవీ నిరాశపరిచింది. దీంతో ఈ మూవీతో హిట్ కొట్టాలని అంతా భావిస్తున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. గుబురు గెడ్డం, పొడవాటి జుట్టు పక్కా మాస్ లుక్‌లో అఖిల్ అదరగొట్టారు.
ఈ మూవీలో శివాజీ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అలాగే, బాలీవుడ్ స్టార్ ప్రతీక్ గాంధీ విలన్ రోల్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మ్యూజిక్ లెజెండ్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.






















