Dreams Meaning : కలలో డబ్బు-బంగారం కనిపిస్తే ఏమవుతుంది, శుభమా-అశుభమా!
Dreams Meaning : కొన్ని కలలు మనకు ఆనందాన్ని ఇస్తాయి, మనల్ని అప్రమత్తం చేస్తాయి లేదా మన భవిష్యత్తు గురించి హెచ్చరిస్తాయి మరి కలలో డబ్బు, బంగారం కనిపిస్తే ఏమవుతుంది..ఎలాంటి ఫలితాన్నిస్తుందో తెలుసా..
Dreams Meaning : కలల ప్రపంచం చాలా శక్తివంతమైనది. అవి మన అంతర్గత నమ్మకాలు, సామర్థ్యాల గురించి మనకు అవగాహన కల్పించడమే కాదు మానసిక ఆందోళనల నుంచి దూరం చేసి, మనసులో ఉన్న కొన్ని భయాలను తొలగించేందుకు కూడా సహాయపడతాయి. ప్రతి వ్యక్తికి వేర్వేరు కలలొస్తుంటాయి..ఒకరు కలలు కన్న తర్వాత సంతోషంగా ఉంటే..ఇంకొకరు భయపడతారు.. మరొకరు బాధపడతాడు. వాస్తవానికి కలలు కనడం ఎవ్వరి అధీనంలోనూ ఉండదు. నిద్రపోయేముందు ఏం ఆలోచిస్తామో.. నిద్రలో మనసెక్కడ తిరుగుతుందో అదే కలగా కనిపిస్తుందంటారు. అందుకే ఇలలో సాధ్యం కాదు అనుకున్న విషయాలు చాలా కలలో జరుగుతుంటాయి. అసాధ్యం అనుకున్న విషయాన్ని సుసాధ్యం చేసే మరో ప్రపంచం అంది. అయితే ఒక్కో కల వెనుక ఒక్కో ఆంతర్యం ఉంటుదంటారు నిపుణులు. .
Also Read: ఇలాంటి కల వస్తే ఆరునెలల్లో చనిపోతారట!
ఎత్తు నుంచి పడిపోవడం, వేగంగా పరిగెత్తడం, పళ్లు విరగడం, నాణేలు ఇవ్వడం లేదా స్వీకరించడం లాంటి కొన్ని సాధారణ కలలు అందరికీ వస్తుంటాయి. అయితే అలాంటి కలలు ఇచ్చే సూచనల బట్టి వాటి ఫలితాన్ని అర్థం చేసుకోవాలి అంటారు నిపుణులు. మరి కాసుల వేటలో ఉరకల పరుగుల జీవితాన్ని గడుపుతున్న చాలామందికి అదే డబ్బు, బంగారం, నాణాలు కలోల కనిపిస్తే ఏమవుతుంది..అది శుభమా-అశుభమా..
1) కలలో కరెన్సీ కనిపిస్తే
మీరు మీ కలలో కరెన్సీ కి సంబంధించిన (కరెన్సీ)కి సంబంధించిన నాణేలు, నోట్లును చూసినట్లయితే..అది మీ రాబోయే ఖర్చులు లేదా రాబోయే లాభాలను సూచిస్తుంది. మీ కలలో ఎవరైనా ఈ నాణేలను ఇస్తే రాబోయే కాలంలో మీరు ఖచ్చితంగా కొంత లాభం పొందుతారని అర్థం. మీరు ఎవరికైనా ఈ నాణేలను ఇవ్వడం కలలో కనిపిస్తే..రాబోయే కాలంలో ఆర్థిక నష్టం ఉండబోతోంది జాగ్రత్త అని హెచ్చరిక అన్నమాట.
2) కలలో బంగారు నాణేలు కనిపిస్తే
కలలో బంగారు నాణేలు కనిపిస్తే అస్సలు టెన్షన్ పడొద్దు. కలలో బంగారు నాణేలను చూడటం సూర్యుడికి సంబంధించినది. సూర్యుడు ఉత్సాహానికి సూచన. ఏదైనా పనిని చేయాలా వద్దా అని నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉంటే మాత్రం సంతోషంగా ఉంటాలి. మీరు చేయబోయే పని మీకు మంచి ఫలితాలనిస్తుందని ఈ కల అర్థం.
Also Read: భర్త భార్యను- భార్య భర్తను హింసిస్తే గరుడ పురాణం ప్రకారం శిక్షేంటో తెలుసా!
3) కలలో వెండి నాణేలు కనిపిస్తే
మీకు కలలో వెండి నాణేలు కనిపిస్తే అది చంద్రుడిని సూచిస్తుంది. అలాంటి కల మన అంతర్ దృష్టికి సూచిక. చంద్రుడు మనస్సకి సంబంధించిన వాడుకావడం వల్ల..ఏదైనా విషయంలో గందరగోళం ఉన్నట్టైతే అప్పుడు మీ మనసు చెప్పింది వినండని అర్థం.
4) కలలో రాగి నాణేలను చూడటం
రాగి నాణేలు అంగారక గ్రహానికి సంబంధించినవి. కలలో రాగి నాణేలు కనిపిస్తే..ఆరోగ్యానికి సంబంధించినవి అన్నమాట. మీరు మీ కలలో ఒకరి నుంచి రాగి నాణేలను తీసుకోవడం చూస్తే..మీరు దీర్ఘకాలంగా పోరాడుతున్న సమస్య లేదా వ్యాధి నుంచి ఇప్పుడు బయటపడతారని అర్థం. మీ చేతి నుంచి రాగి నాణేలు ఎవరికైనా ఇస్తే అనారోగ్య సమస్య సూచనలున్నాయి అప్రమత్తంగా ఉండాలని అర్థం