చాణక్య నీతి: పాము నుంచి తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన లక్షణాలివే



ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మనిషి జీవితంలో అనేక రకాల సమస్యలతో పోరాడుతూ ముందుకు సాగడానికి స్ఫూర్తినిచ్చాడు.



అదే సమయంలో ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కొన్ని లక్షణాలు అలవర్చుకోవాలని కూడా చెప్పాడు



మానవ జీవితం ఎత్తుపల్లాలతో నిండి ఉంటుంది. మీ కోసం ప్రతి మలుపులో ఏదో ఒక సవాలు వేచి ఉంటుంది. అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎదురించి పోరాడేందుకు పాము స్ఫూర్తి అంటాడు చాణక్యుడు



చాణక్య నీతి ప్రకారం...పాము లోపల ఉన్న విషాన్ని తొలగించినప్పటికీ అది బుసకొట్టడం ఆపదు..అందుకే విషం లేదని తెలిసినా పాము దగ్గరకు వెళ్లాలంటే భయపడతారు



అలాగే మనిషి కూడా కష్ట సమయంలో తమ బలహీనతలన్నీ బయట పడేసుకుంటే శత్రువుల బలం పెంచడమే కాదు వారికి మనల్ని ఓడించే అవకాశం ఇచ్చినట్టే



పాముని చితక్కొట్టినా ఆఖరి క్షణం వరకూ బుసకొట్టడం ఆపదు, తిరగడబడం మానదు..అలాగే కష్టాల్లో ఉన్నవారు కూడా ఇక తమ పనైపోయిందని భావించకూడదు..ప్రయత్నం ఆపకూడదు.



బలహీనత బయపెట్టడకపోవడం మాత్రమే కాదు తమలో బలం తగ్గలేదని శత్రువుకి అర్థమయ్యేలా ఉండాలి..ఇలా చేయగలిగితే సగం గెలుపు మీదే అవుతుంది అంటాడు చాణక్యుడు



అదే సమయంలో మనచుట్టూ ఉండి మోసపూరితంగా వ్యవహరించే వ్యక్తులను పాములకన్నా విషపూరితమైనవారని పోల్చాడు చాణక్యుడు.



ఓ వ్యక్తి సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు తన బాధను పంచుకునేందుకు స్నేహితులు అవసరం. మీ చుట్టూ ఉన్న స్నేహితులు అలాంటివారా.. లేదంటే అదనుచూసి కాటేసేవారో గ్రహించగలగాలన్నాడు చాణక్యుడు.